నవంబరు 8 నుండి డిశెంబరు 13వ తేది వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక సోమవారాలు
నవంబరు 8 నుండి డిశెంబరు 13వ తేది వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక సోమవారాలు
: తిరుపతి, 2010 నవంబర్-06కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 8వ తేది నుండి డిశెంబరు 13వ తేది వరకు కార్తీక సోమవారాల పండుగలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా నవంబర్ 8,15,22,29 డిశెంబర్ 6,13వ తేదీలలో కార్తీక సోమవారాలు, నవంబర్ 21వ తేదిన కార్తీక దీపోత్సవం వేడుకగా నిర్వహిస్తారు.
ఈ కార్తీక సోమవారాల సందర్భంగా ఆలయంలో తితిదే ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పురాణప్రవచనం అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.