నవంబర్‌ 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”కల్యాణకట్టలో అవినీతిగుట్టలు”, ”అక్రమార్జనలో ఆరితేరిన టిటిడి కక్షురకులు”, ”నోట్లకట్టలతో కళ్ళు మూసుకున్న విజిలెన్స్‌” అనే వార్త‌కు వివరణ

నవంబర్‌ 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”కల్యాణకట్టలో అవినీతిగుట్టలు”, ”అక్రమార్జనలో ఆరితేరిన టిటిడి కక్షురకులు”, ”నోట్లకట్టలతో కళ్ళు మూసుకున్న విజిలెన్స్‌” అనే వార్త‌కు వివరణ

నవంబర్‌ 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”కల్యాణకట్టలో అవినీతిగుట్టలు”, ”అక్రమార్జనలో ఆరితేరిన టిటిడి కక్షురకులు”, ”నోట్లకట్టలతో కళ్ళు మూసుకున్న విజిలెన్స్‌” అని ప్రచురించిన వార్త ఆధార రహితం, ఊహాజనితం.


అదేవిధంగా అవినీతికి ఆస్కారం ఇస్తున్నట్లు భావిస్తున్న కల్యాణకట్ట డిప్యూటీ ఇఓ బాబును బాధ్యతల నుండి తప్పించినట్లు, కొద్దిరోజుల సెలవుపై వెళ్ళాల్సిందిగా ఆదేశించినట్లు ప్రచురించడం కూడా నిజం కాదు. వాస్తవానికి డిప్యూటీ ఇఓ బాబు చాలా నిజాయితీపరుడు. ఆయన మంచి ప్రవర్తన కల్గిన వ్యక్తి. ఆయన ఎక్కడ పనిచేసినా, ఎప్పుడైనా పూర్తి నిజాయితీతో, నిబద్దతతో తన బాధ్యతలను చక్కగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతున్నాడనడంలో సందేహంలేదు.

డిప్యూటీ ఇఓ బాబు తనకు ఆరోగ్య కారణాల వలన తిరుమల నుండి తిరుపతికి మార్చాలని కొన్ని నెలలుగా కోరుతున్నాడని, ఈవిషయమై తనని పలుమార్లు అభ్యర్థించాడని ఇఓ తెలిపారు. బ్రహ్మోత్సవాలు దృష్ఠిలో వుంచుకొని వారిని అప్పుడు బదిలీ చేయలేదని,అతి త్వరలో జరిగే డిప్యూటీ ఇఓల బదిలీలలో వీరికి ముఖ్యమైన శాఖలో పోస్టింగ్‌ ఇవ్వనున్నామని ఇఓ తెలిపారు.

ఈ సందర్భంగా వార్త దినపత్రికనందు ఆధారంలేని వార్తలు వారి మనస్సును, నా మనస్సును కలచి వేస్తున్నదని ఇఓ తెలిపారు. గత 30 ఏళ్ళుగా ఎటువంటి మచ్చలేని వ్యక్తిత్వంతో విధులు నిర్వహిస్తున్న బాబుపై ఇటువంటి వార్తలు వ్రాయవద్దని ఇఓ ప్రకటనలో కోరారు.

కనుక ఈ విషయాన్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.  


ప్రజాసంబంధాల అధికారి

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి