నవంబర్ 7వ తేదిన లక్షబిల్వార్చన సేవ
నవంబర్ 7వ తేదిన లక్షబిల్వార్చన సేవ
తిరుపతి, నవంబర్-06,2009: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబర్ 7వ తేదిన లక్షబిల్వార్చన సేవను నిర్వహిస్తారు.
ఈసేవకు రు.100/-లు చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చును. ఈసందర్భంగా ఆలయంలో ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఊంజల్మండపం వద్ద లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 1.30 నుండి దీపారాధన, సహస్రనామర్చన, సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన జిల్లా ధార్మిక సలహామండళ్ళ సభ్యులకు నవంబర్ 8వ తేదిన ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక శ్వేత నందు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.