నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవములు

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవములు
 
తిరుపతి, ఏఫ్రిల్‌ 16, 2011: నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో ఈనెల 18 నుండి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవములు వేడుకగా నిర్వహిస్తారు. అంకురార్పణం ఏప్రిల్‌ 17న నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఈ క్రింది వాహనములలో ప్రతిరోజు భక్తులకు దర్శనమిస్తారు.
 

తేది   ఉదయం  సాయంత్రం

18-04-2011 ధ్వజారోహణం(ఉ.9-10 గంటలకు) పెద్దశేష వాహనం
19-04-2011 చిన్నశేష వాహనం హంస వాహనం
20-04-2011 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
21-04-2011 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
22-04-2011 మోహినీఅవతారం గరుడవాహనం
23-04-2011 హనుమంత వాహనం గజ వాహనం
24-04-2011 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
25-04-2011 రధారోహణం(రథోత్సవం) అశ్వ వాహనం
26-04-2011 స్నపన తిరుమంజనం ధ్వజారోహణం
చక్రస్నానం(ఉ.9.00 గంటలకు)

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 25వ తేదిన ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సము నిర్వహిస్తారు. కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన భక్తులు 300/-లు చెల్లించి పాల్గొనవచ్చును. తితిదే ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.