నాదనీరాజనం వేదికపై ధార్మిక, సంగీత కార్యక్రమాలు
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
నాదనీరాజనం వేదికపై ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2021 అక్టోబరు 09: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
తిరుపతికి చెందిన సౌందర్యలహరి మహిళ సమఖ్య బృందం సభ్యులు ఉదయం 9 నుండి 9.45 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
ఆధ్యాత్మిక ప్రవచనం
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ముకుందమాల – శ్రీ కులశేఖరలుపై ఉపన్యసించారు.
హరికథ
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ భాగవతారిణి శ్రీమతి వరలక్ష్మి మధ్యాహ్నం 2 నుండి 3.15 గంటల వరకు హరికథ పారాయణం చేశారు.
అన్నమయ్య సంకీర్తన లహరి
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తిరుపతికి చెందిన శ్రీ శ్రీనివాస కుమార్ బృందం మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట పలు అన్నమయ్య సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.