నో డెమోన్‌స్ట్రేషన్‌ జోన్‌) ఏర్పాటు వార్తలు నిజం కాదు

నో డెమోన్‌స్ట్రేషన్‌ జోన్‌) ఏర్పాటు వార్తలు నిజం కాదు

తిరుపతి, ఏప్రిల్‌ 11, 2011: తితిదే పరిపాలనాభవనం ముందు నిషిద్దప్రాంతం (నో డెమోన్‌స్ట్రేషన్‌ జోన్‌) ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొన్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదు.

ఈ అంశానికి సంబంధించి తితిదేలోని ఉద్యోగసంఘాలతో చర్చలు జరిపి ప్రతిపాదన చేయడం జరిగిందే తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.అయితే ఈ విషయానికి సంబంధించి తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి.స్థానిక రాజకీయ పార్టీ నాయకులతో చర్చించి పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొన్న తర్వాత వస్తానని ఇఓకు తెలియజేయడం జరిగింది. ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.
ఈ విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది పూర్తిగా ప్రజాస్వామికంగా అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని వుంటుందని తెలియజేస్తున్నాం. ఎటువంటి నిర్ణయం తీసుకొని ఈ విషయమై నిరసనలు చేయడం సముచితం కాదని మనవిచేస్తున్నాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.