న‌వంబ‌రు 30న శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

న‌వంబ‌రు 30న శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

తిరుప‌తి, 2021 న‌వంబ‌రు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మొద‌టి రోజైన మంగ‌ళ‌వారం మ‌ద్యాహ్నం 3 గంట‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీమ‌తి పాముల పుష్ప శ్రీ‌వాణి పట్టువస్త్రాలు సమర్పించ‌నున్నారు.

ప్ర‌తి ఏడాది  శ్రీ పద్మావతి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.