BHOOMI PUJA PERFORMED TO NEW PARAKAMANI BUILDING _ పరకామణి భవనానికి భూమిపూజ‌

Tirumala, 14 Aug. 20: TTD Chairman Sri YV Subba Reddy and Donor Sri Muralikrishna performed the ground breaking puja for construction of new Parakamani building in front of the Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex (MTVAC) at Tirumala on Friday.

Speaking to media on the occasion the TTD chairman said the exercise of counting the contributions of devotees in the Srivari Hundi is called Parakamani.

He said the need for a separate building for counting and accounting operations of hundi to be carried out was a long felt need as hitherto the exercise was confined to the Srivari temple.

On many occasions, it was difficult to observe social distancing in the Parakamani as 200 persons per shift, nearly 600 per day were discharging the duties. Besides security issues, it was difficult for Parakamani workers to come out of the temple for nature calls as well. Hence TTD has decided to construct a new building for Parakamani.

He said the new Parakamani Bhavan will be constructed in a sprawling area of 14962 sq. feet at a cost of ₹8.90 crore was donated by a devotee from Bangalore, Sri K Muralikrishna. The ground floor of the first block comprised of offices for Dyeo, AEO, AVSO, waiting hall for staff. The ground floor of the second block comprised of sorting halls, 1 hundi strong room, 1 Perubadi strong room and also the Donor cell-waiting hall.

The next floor consisted of sorting hall. Ten strong rooms for the Banks to secure the counted money. To facilitate the devotees to watch the counting operations, the entire walls of the building will also be done with glass.

Donor Sri Muralikrishna said it was his privilege to provide for a new Parakamani building and was confident to complete the construction work as early as possible.

Parakamani is not a religious activity. On many occasions the Srivari hundi is being transported from Srivari temple, Tirumala to TTD administrative building at Tirupati for counting operations. Parakamani operations are conducted daily under the supervision of the Tirumala pontiffs. The Parakamani staff have to undergo security check both during entry and exit causing disturbance to devotee darshan queue lines often.

The present Parakamani location inside the Srivari temple is not adequate for the counting of 13-14 hundials which accumulates every day with the offerings made by devotees. As a result of a delay in counting nearly ₹50 crore worth coins are kept pending to transfer to banks for safekeeping since many years. It was also difficult to remove huge stock of hundi coins outside the temple as well.

The present Parakamani location inside Srivari temple does not have openings of exhaust fans to remove dust and bad odour of the hundi cloth and vessels causing respiratory ailments. As a result, the many employees are not opting for Parakamani assignment. 

The TTD board decided to move parakamani outside Srivari temple following written advice by both the Tirumala pontiffs. The new parakamani building will have toilets, restrooms and also exhaust fans. Two German machinery are being deployed to speed up the process for segregation of coins same day itself.

TTD additional EO Sri A V Dharma Reddy, Chief Engineer Sri Ramesh Reddy, SE 2 Sri Nageswara Rao, EE 1 Sri Jaganmohan Reddy and VGO Sri Manohar participated

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పరకామణి భవనానికి భూమిపూజ‌

తిరుమల, 2020 ఆగ‌స్టు 14: తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం ఎదురుగా నిర్మించ‌నున్న నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నానికి శుక్ర‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, దాత శ్రీ ముర‌ళీకృష్ణ‌తో క‌లిసి భూమిపూజ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను లెక్కించే కార్య‌క్ర‌మాన్ని ప‌ర‌కామ‌ణి అంటారని చెప్పారు. హుండీ కానుక‌లు ఇప్ప‌టిదాకా ఆల‌యం లోప‌లే లెక్కిస్తున్నార‌ని, ఈ విభాగానికి ప్ర‌త్యేకంగా ఒక భ‌వనం ఉండాల‌ని చాలా ఏళ్లుగా చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు. పరకామణిలో ఇప్పుడు ఒక షిఫ్ట్ లో 200 మంది చొప్పున రోజుకు 600 మంది పని చేస్తున్నార‌ని, ఒకేసారి 200 మంది కూర్చుని హుండీ కానుకలు లెక్కించడం వలన భౌతిక దూరం పాటించడం కష్టంగా ఉందన్నారు. పరకామణి విధుల‌కు వచ్చిన వారు కాల‌కృత్యాల‌కు వెళ్లాల్సి వస్తే ఆలయం బయటకు రావాల్సి ఉండ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందిగా కలుగుతోందన్నారు. ఈ సమస్యలు తీర్చడానికే కొత్త భవనం నిర్మించాలని త‌మ బోర్డు నిర్ణ‌యించింద‌న్నారు.

14,962 చ.అడుగుల విస్తీర్ణంలో రూ.8.90 కోట్లతో ఈ భ‌వ‌నాన్ని బెంగళూరుకు చెందిన శ్రీ కె.మురళీకృష్ణ అనే దాత నిర్మిస్తున్నార‌ని, చాలా సంతోష‌క‌ర‌మ‌ని ఛైర్మ‌న్ చెప్పారు. మొదటి బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్ లో డిప్యూటీ ఈవో, ఏఈఓ, ఏవిఎస్ఓ గదులు, సిబ్బంది వెయిటింగ్ హాల్, రెండో బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో సార్టింగ్ హాలు, 1 హుండీ స్ట్రాంగ్ రూమ్, 1 పేరుబడి స్ట్రాంగ్ రూమ్ తో పాటు డోనార్ సెల్ వెయిటింగ్ హాల్ ఉంటాయ‌ని తెలిపారు. మరో అంతస్తులో సార్టింగ్ హాల్, బ్యాంకులు సొమ్మును భ‌ద్ర‌ప‌రుచుకునేందుకు వీలుగా పది స్ట్రాంగ్ రూములు ఉంటాయ‌ని వివ‌రించారు.  ప‌ర‌కామ‌ణి లెక్కింపును భ‌క్తులు చూసేందుకు వీలుగా అద్దాల‌తో ఈ నిర్మాణం ఉంటుంద‌ని, భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేస్తామ‌ని తెలిపారు.

దాత శ్రీ కె.మురళీకృష్ణ మాట్లాడుతూ పరకామణి నూతన భవనం నిర్మించే అవకాశం రావడం త‌న పూర్వజన్మసుకృతమన్నారు. వీలైనంత త్వరగా కొత్త భవనాన్ని పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

కాగా, హుండీ లెక్కింపు ఆల‌య కైంక‌ర్యాల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మం కాదు. చాలా సంద‌ర్భాల్లో హుండీల‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నానికి తీసుకెళ్లి లెక్కింపు చేయ‌డం జ‌రిగింది. ప్ర‌తిరోజూ జీయ‌ర్‌స్వాముల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌ర‌కామ‌ణి జ‌రుగుతుంది. సిబ్బంది కాల‌కృత్యాల కోసం వెలుప‌లికి వెళ్లిన‌పుడు, తిరిగి ప్ర‌వేశించిన‌పుడు ప్ర‌తిసారీ భ‌ద్ర‌తా సిబ్బంది త‌నిఖీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భక్తుల క్యూలైన్‌కు అంత‌రాయం క‌లుగుతుంది. రోజుకు 13 నుండి 14 హుండీలు నిండుతాయి. వాటిని విప్పి కానుక‌లు లెక్కించేందుకు అవ‌స‌ర‌మైన స్థ‌లం ప్ర‌స్తుతం ఉన్న ప‌ర‌కామ‌ణి ప్రాంతంలో లేదు. ఈ కార‌ణంగా లెక్కింపు ఆల‌స్యం అవుతుండ‌డంతో దాదాపు రూ.50 కోట్ల చిల్ల‌ర నాణేలు బ్యాంకుల‌కు అప్ప‌గించకుండా అలాగే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

హుండీ విప్పిన‌పుడు వ‌చ్చే దుమ్ము, ధూళిని ఎగ్జాస్ట్ ఫ్యాన్ల ద్వారా బ‌య‌ట‌కు పంపే అవ‌కాశం ఇక్క‌డ లేదు. దీనివ‌ల్ల ఊపిరితిత్తుల‌కు సంబంధించిన ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయ‌ని ఉద్యోగులు త‌ర‌చూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కార‌ణంగా ఉద్యోగులు ప‌రకామ‌ణి విధులు నిర్వ‌హించేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సౌక‌ర్యాల‌తో ప‌ర‌కామ‌ణి ఉండాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. ప‌ర‌కామ‌ణి నుండి చిల్ల‌ర నాణేల‌ను ఆల‌యం వెలుప‌లికి తీసుకురావ‌డం కూడా క‌ష్ట‌సాధ్యంగా మారుతోంది. దీనివ‌ల్ల భ‌క్తుల క్యూలైన్ల‌ను నిలపాల్సిన ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితుల్లో శ్రీ‌వారి ఆల‌యం నుండి ప‌ర‌కామ‌ణిని వెలుప‌లికి త‌ర‌లించి కానుక‌ల లెక్కింపు చేప‌ట్టాల‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి లిఖిత‌పూర్వ‌కంగా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం జ‌రిగింది. నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో సిబ్బంది కాల‌కృత్యాలు తీర్చుకోవ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. మంచి గాలి వెళుతురు ఉండేలా, దుమ్ము ధూళి వెలుప‌లికి పంపేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ల‌ను ఏర్పాటుచేస్తారు. ఏరోజు నాణేల‌ను ఆరోజు లెక్కించి డినామినేష‌న్ ప్ర‌కారం వేరుచేసేందుకు వీలుగా జ‌ర్మ‌నీలో త‌యారుచేసిన రెండు యంత్రాల‌ను స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ‌ రమేష్ రెడ్డి, ఎస్ఈ శ్రీ నాగేశ్వరరావు, ఇఇ శ్రీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, విజిఓ శ్రీ మనోహర్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.