EO REVIEW ON BIRRD HOSPITAL _ పరికరాల కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి

Tirupati, 09 April 2021:   TTD EO Dr KS Jawahar Reddy on Friday directed officials to set up a centralized procurement cell for the purchase of medical equipment and Medicines through a single agency for BIRRD, SVIMS and central hospitals run by TTD.

Speaking at a review meeting on the progress of development activities of the BIRRD hospital at Sri Padmavati Rest House, the TTD EO urged officials to set up help desks and reception cells besides electronic display boards in BIRRD to transform it into a  patient-friendly unit.

He said new rooms built for in-patients should be commissioned and the artificial limbs unit should be strengthened by completing the purchase of New Equipments.

Dr Jawahar Reddy instructed officials to complete arrangements by end of May to operate the Cath lab and blood banks in BIRRD hospital.

He directed officials to clear the plastic water bottles dumped on Alipiri- Tirumala Road and spread awareness among devotees about the ban on the use of plastic bottles.

Since alternative arrangements for Drinking water is being made at Tirumala, plastic bottles should not be allowed to Tirumala.

Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Honorary Director of BIRRD hospital Dr Madanmohan Reddy, Health Advisor Dr Swetha, CE Sri M Ramesh Reddy, FA& CAO Sri O Balaji, C S RMO Sri Shailendra, Health officer Dr R R Reddy, Dr Muralidhar and others were also present. 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పరికరాల కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి

– బర్డ్ ఆసుపత్రి పేషంట్
ఫ్రెండ్లీ గా ఉండాలి

అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

తిరుపతి 9 ఏప్రిల్ 2021: బర్డ్ ఆసుపత్రిలో ఆపరేషన్లకు అవసరమయ్యే పరికరాలు, రోగులకు తక్కువ ధరలోమందులు అందించే ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం బర్డ్ ఆసుపత్రి అభివృద్ధి పనులపై ఈవో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బర్డ్, స్విమ్స్, సెంట్రల్ హాస్పిటల్ కు అవసరమయ్యే మందులు, పరికరాలు ఓకే విభాగం ద్వారా కొనుగోలు చేయడానికి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెల్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. బర్డ్ ఆసుపత్రి పేషంట్ ఫ్రెండ్లీ ఆసుపత్రిగా ఉండాలనీ, హెల్ప్ డెస్క్ లు, రిసెప్షన్ డెస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. రోగుల కోసం కొత్తగా నిర్మించిన గదులను వెంటనే ఉపయోగం లోకి తేవాలని చెప్పారు. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు. అధునాతన పరికరాల కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. క్యాథ్, ల్యాబ్ మే 30వ తేదీకి ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలన్నారు. ఈనెలాఖరు కు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తి చేయాలని డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులు బర్డ్ కు వచ్చి శ్రీవారి సేవగా వైద్య సేవలు,ఆపరేషన్లు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం జరిగిన మరో సమీక్ష లో ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, అలిపిరి – తిరుమల నడక దారిలో రోడ్డు పక్కల ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లువెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో వాటర్ బాటిళ్ల వాడకం నిషేధించిన విషయం గురించి భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. కొండ మీద ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున అలిపిరిలోనే వాటర్ బాటిళ్లను అనుమతించారాదన్నారు.

ఈ సమావేశాల్లో అదనపు ఈవో, బర్డ్ ఎండి శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, బర్ద్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, ఆరోగ్య సలహాదారు డాక్టర్ శ్వేత, సీఈ శ్రీ రమేష్ రెడ్డి, ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ బాలాజి, సి ఎస్ ఆర్ఎంవో శ్రీ శేష శైలేంద్ర, ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి, బర్డ్ ముఖ్య పాలనాధికారి శ్రీ రెడ్డెప్ప, ఎస్ ఈ లు శ్రీ నాగేశ్వరరావు, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది