పాడిపశువులను దానముగా (వితరణ) ఇవ్వగోరు భక్తులకు విన్నపము

తిరుపతి, మార్చి-31, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయము మరియు దేవస్థానము అనుబంధ ఆలయముల నిత్య కైంకర్యముల కొరకు పాడిపశువులను దానముగా (వితరణ) ఇవ్వగోరు భక్తులకు విన్నపము ఏమనగా!
ప్రస్తుతము తిరుపతి నందు వున్న యస్.వి.గోసంరక్షణశాల యందు దానంగా ఇచ్చిన పశువుల సంఖ్య పరిమితికి మించి అధికమైనందున తగినంత స్థలము లేనందున మరియు త్రాగునీటి ఎద్దడి వలన, తిరుమల తిరుపతి దేవస్థానము పాలక మండలి నిర్ణయము మేరకు క్రింది కనబరచిన నియమ నిబందనల ప్రకారము భక్తులు గోవితరణ చేయవలసినదిగా కోరుచున్నాము.

1. భక్తులు వితరణ ఇవ్వగోరు పాడి పశువులు ”దేశవాళి ఆవులు” అనగా గిర్, షాహివాల్, తార్‌పార్కర్, రెడ్‌సింధి మరియు ఒంగోలు జాతి ఆవులు మాత్రమే ఇవ్వవలసిందిగా మనవి.
2. భక్తులు యిచ్చు ఆవులు రోజుకు 8-10 లీటర్లపాలు యిచ్చు పాడి ఆవులు (పైన తెల్పిన జాతి) మరియు ఒంగోలు జాతి ఆవులు రోజుకు కనీసం 5 లీటర్ల పాలు యిచ్చునవి మాత్రమే యివ్వవలసిందిగా మనవి.
3. కోడెలు, కోడెదూడలు, ఆవు దూడలు, పాలు యివ్వని, వయస్సు మీరినవి, బక్కచిక్కిన ఆవులు యివ్వవద్దని మనవి.
4. ముఖ్యముగా ఆనారోగ్య పశువులను వితరణ చేయుట వలన గోశాలలోని ఆరోగ్యవంతమైన పశువులన్నింటికి వాటి జబ్బులు వ్యాప్తి చెందు అవకాశము వున్నది. కావున భక్తులు మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు గమనించ ప్రార్థన.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.