SVBC IS THE CHIEF TOOL OF SANATANA DHARMA PRACHARA-EO _ పారాయ‌ణంతో ఆధ్యాత్మిక చైత‌న్యం డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో భ‌క్తుల ప్ర‌శంస‌

IMMENSE RESPONSE ACROSS THE GLOBE FOR PARAYANAMS

 FULL SECURITY FOR TTD PROPERTIES AND CHARIOTS

Tirupati, 13 Sep. 20: It’s a raining of accolades from pilgrim callers across the country for the live streaming of various Parayanams in Sri Venkateswara Bhakti Channel of TTD during the monthly Dial your EO Programme that took place in Meeting Hall of TTD Administrative Building in Tirupati on Sunday. 

Callers poured in appreciation for Veda Parayanam, Sindarakanda Pathanam, Virataparva Parayanam and the newly introduced Bhagavat Gita Parayanam and complimented the efforts of TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy who is also the MD of SVBC. 

Pilgrim callers Smt Gita Prakash from Hubli, Karnataka, Sri Subramanyam from Chennai of Tamilnadu, Sri Ramachandramurthy, Smt Sujata and Smt Sandhya from Hyderabad, Telangana, Sri Prasad Rao and Sri Srinivasulu from Nellore, Sri Chengappa from Ramasamudram, Smt Ramadevi from Tenali thanked TTD for designing Parayanams and telecasting live on SVBC especially during COVID pandemic and sought to continue forever. 

Thanking all the pilgrim callers through live phone-in program, the EO said, all the parayanam programs have won not only from across different parts of the country but globally. 

“Never before in the history of SVBC since its inception some 12 years ago, has received such an overwhelming response for its programs and we are glad to see the reception from devotees”. 

Adding further he said, TTD will continue the programmes for ever as SVBC is the best tool to reach a wide range of pilgrims to take up Hindu Sanatana Dharma to the nook and corner. Apart from Parayanams, we are also contemplating to design some programs targeting children and youth as there is every need to imbibe and teach the values embedded in our epics and scriptures to the next generations”, he maintained. 

Answering a caller Sri Appanna from Visakhapatnam, who sought protection to sacred chariots of TTD in view of Antarvedi incident, the EO said, TTD has hi-fi security cover for its properties and chariots. “Our Chief Vigilance and Security Officer along with Urban SP also had an elaborate meeting on how to extend protection at all temples recently. So no need to worry as we are fully geared up”,  he added.

When some pilgrims sought to resume Sarva Darshan, EO told them, TTD has earlier released 3000 tokens of time slot Sarva darshan tokens in offline. But following a caution call about the spread of corona as devotees are gathering in thousands from other states owing to Peratasi holy month floating the norms of Social Distancing and wearing masks, we have temporarily stalled issuing tokens at Tirupati till this month-end.

On a query on Vaikuntha Ekadasi Darshan during December, EO said, the decision will be taken based on the Covid situations and norms issued by Central and State Governments. 

CAG FOR TRANSPARENCY

Before taking the calls from pilgrims, EO said to have a transparent administration the auditing of TTD properties will be carried out by Comptroller and Auditor General. The EO said TTD is often dragged into multiple controversies by those with vested interests saying that our funds are being diverted to other causes other than Hindu Dharma Prachara and auditing by CAG will put an end to all”, EO asserted. 

The EO said, darshan for Online Kalyanotsavam. Grihatas is introduced by TTD and the devotees who booked in online can avail darshan within 90days from the day of their booking. He also said, Kalyana Kankanams will also be sent along with Prasadam through the postal department. 

Similarly, as we have stalled all arjitha sevas due to covid, the Udayastamana Seva ticket holders and Vimsathi Varsha Darshini ticket holders will be given darshan in VIP break till situation turns to normalcy, he maintained. 

Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri P Basanth Kumar, Smt Sada Bhargavi,  CVSO Sri Gopinath Jatti, CE Sri M. Ramesh Reddy were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పారాయ‌ణంతో ఆధ్యాత్మిక చైత‌న్యం

డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో భ‌క్తుల ప్ర‌శంస‌

తిరుమల, 13 సెప్టెంబ‌రు 2020: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్రసారం చేస్తున్న సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం, గీతాపారాయ‌ణం, వేద‌పారాయ‌ణం లాంటి కార్య‌క్ర‌మాలు చాలా బాగున్నాయ‌ని, వీటి కొన‌సాగింపుగా మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు రూపొందించి ప్ర‌సారం చేయాల‌ని ప‌లువురు భ‌క్తులు కోరారు. ఈ కార్య‌క్ర‌మాలు భ‌క్తుల్లో ఆధ్యాత్మిక‌త చైత‌న్యం, సానుకూల దృక్ప‌థాన్ని పెంపొందించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని ప్ర‌శంసించారు. తిరుప‌తి టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో ఆదివారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సమాధానాలు ఇచ్చారు.

1. అప్ప‌న్న – విశాఖ‌

ప్రశ్న: ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వం బాగుంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగుతున్న క‌ల్యాణంలో ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తించండి. తిరుమ‌ల‌లోని ర‌థం వ‌ద్ద భ‌ద్ర‌త పెంచండి.

ఈవో : సెప్టెంబ‌రు 21 నుండి ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌తో ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో రానున్న బోర్డు స‌మావేశంలో చ‌ర్చించి ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించే విష‌య‌మై త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం. టిటిడి ఆల‌యాల్లోని ర‌థాలు, ఆస్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాం.

2. ఆంజ‌నేయులు – చీమ‌కుర్తి

ప్రశ్న: త‌క్కువ మంది భ‌క్తులు వ‌స్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ద‌గ్గ‌రి నుండి స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించండి.

ఈవో : ఇప్పుడు భౌతిక‌దూరం పాటిస్తూ తోపులాట‌లు లేకుండా సంతృప్తిక‌రంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నాం. ఇంకా ద‌గ్గ‌రికి అనుమ‌తిస్తే భ‌క్తులు భౌతిక‌దూరం పాటించే అవ‌కాశం ఉండ‌దు.

3. గీతాప్ర‌కాష్ – హుబ్లి

ప్రశ్న: ఎస్వీబీసీ స్క్రోలింగ్‌లో సూక్తులు ఇస్తే బాగుంటుంది. కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసే స‌య‌మంలో వాటి వివ‌రాలు ఇవ్వాలి. ఇ-హుండీ వివ‌రాలు కూడా తెల‌పండి.

ఈవో : ఈ విష‌యాల‌ను ప‌రిశీలించి అమ‌లుచేస్తాం. టిటిడికి భ‌క్తులు ఇస్తున్న విరాళాలు, బ‌డ్జెట్‌కు సంబంధించిన వివ‌రాలు వెబ్‌సైట్‌లో పెడుతున్నాం.

4. ప్ర‌భాక‌ర్‌నాయుడు – చిత్తూరు‌, బాల‌చంద్ర – క‌ర్ణాట‌క‌, చెంగ‌ప్ప – రామ‌స‌ముద్రం.

ప్రశ్న: పిల్ల‌ల‌కు త‌ల‌నీలాల మొక్కు చెల్లించాలి. 65 ఏళ్లు పైబ‌డిన వారిని తిరుమ‌ల‌కు ఎప్పుడు అనుమ‌తిస్తారు?

ఈవో : ప‌్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ప్ర‌స్తుతం 10 ఏళ్లలోపు పిల్ల‌ల‌ను, 65 ఏళ్లు దాటిన వారిని శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం లేదు. వ‌చ్చే బోర్డు స‌మావేశంలో ఈ విష‌యంపై త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

5. సుబ్ర‌మ‌ణ్యం – చెన్నై, సుజాత – హైద‌రాబాద్‌, ప్ర‌సాద‌రావు – కావ‌లి, రామ‌చంద్ర‌మూర్తి – హైద‌రాబాద్, శ్రీ‌నివాసులు – నెల్లూరు, శ్రీ‌రామచంద్ర‌మూర్తి – హైద‌రాబాద్‌.

ప్రశ్న: గీతాపారాయ‌ణం బాగుంది. శాశ్వ‌తంగా పారాయ‌ణం కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించండి. భ‌క్తుల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేయండి. సుంద‌ర‌కాండ అర్థ‌తాత్ప‌ర్యాలు చెప్పండి.

ఈవో : ‌సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వ పారాయ‌ణాన్ని కోట్లాది మంది భ‌క్తులు వీక్షిస్తున్నారు. గీతా పారాయ‌ణానికి కూడా విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నిరంత‌రం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నాం. సుంద‌ర‌కాండను ముద్రించి పుస్త‌క‌రూపంలోకి తీసుకొస్తాం. భ‌క్తుల సూచ‌న‌ల ప్ర‌కారం త‌గిన మార్పులు చేస్తాం. రామాయ‌ణం, భార‌తం, భాగ‌వ‌తంపై మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నాము. చిన్న పిల్లల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు త‌యారు చేస్తున్నాం.

6. వెంక‌టేశం – కామారెడ్డి

ప్రశ్న: గోర‌ఖ్‌పూర్ గీతా ప్రెస్‌ను మూసేస్తున్నార‌ని తెలిసింది. మీరు స‌హాయం చేస్తారా?

ఈవో : టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ద్వారా ధార్మిక పుస్త‌కాలు ముద్రిస్తున్నాం. ధ‌ర్మ‌ప్ర‌చారం చేస్తున్న సంస్థ‌లు టిటిడిని సంప్ర‌దిస్తే బోర్డులో చ‌ర్చించి త‌గిన స‌హాయం చేస్తాం. గీతా ప్రెస్ కు సంబంధించి ఎలాంటి ప్ర‌తిపాద‌న‌ మా వ‌ద్ద లేదు.

7. తిరుమ‌ల‌రెడ్డి – రాయ‌చోటి

ప్రశ్న: వైకుంఠ ఏకాద‌శికి ప్ర‌తి ఏటా వ‌స్తున్నాం. ఈసారి ఎంత‌మందిని అనుమ‌తిస్తారు?

ఈవో : అప్ప‌టి ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంటాం.

8. శ్రీ‌నివాసులు – క‌ర్నూలు

ప్రశ్న: ఆగ‌స్టు 17న ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన్నాం. మేము ద‌ర్శ‌నానికి రావ‌చ్చా?

ఈవో : టికెట్ కొనుగోలు చేసి ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన్న గృహ‌స్తులంద‌రూ 90 రోజుల్లోపు తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి ద‌ర్శనం చేసుకోవ‌చ్చు.

9. శ్రీ‌నివాసులు – బెంగ‌ళూరు

ప్రశ్న: స‌ర్వ‌ద‌ర్శ‌నం ఎప్పుడు ప్రారంభిస్తారు ?

ఈవో : పెర‌టాసి మాసం భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డంతో భౌతిక‌దూరం పాటించ‌లేని కార‌ణంగా తిరుప‌తిలోని కౌంట‌ర్ల వ‌ద్ద స‌ర్వ‌దర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాం. ప‌రిస్థితులు అనుకూలించాక తిరిగి ప్రారంభిస్తాం.

10. గ‌ణేష్ – ఏర్పేడు

ప్రశ్న: శ్రీ‌వారి ద‌ర్శ‌నం, సేవ‌ల్లో స్థానికుల‌కు ప్రాధాన్య‌మివ్వండి ?

ఈవో : తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంత భ‌క్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కోస‌మే తిరుప‌తిలో 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీని ప్రారంభించాం. త్వ‌రలోనే తిరిగి టోకెన్లు జారీ చేస్తాం.

11. శ‌కుంత‌ల – తిరుప‌తి

ప్ర‌శ్న: శ్రీ‌వారి సేవకు గ్రూపున‌కు బ‌దులు ఒక్కొక్క‌రికి అవ‌కాశం క‌ల్పించండి.

ఈవో : ఈ విష‌యంపై స‌మావేశం నిర్వ‌హించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

12. శాలిని – గుంటూరు

ప్ర‌శ్న: దాత‌ల పాస్‌బుక్‌లు ఉన్నాయి. 65 సంవ‌త్స‌రాలు దాటిన వారికి ప్ర‌స్తుతం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి లేదు. ఆ త‌రువాతైనా అవ‌కాశం ఉంటుందా .

ఈవో : 65 ఏళ్లు పైబ‌డిన వారికి ఎప్పుడు ద‌ర్శ‌నం క‌ల్పిస్తామో అప్పుడు దాత‌లు కూడా ద‌ర్శ‌నానికి రావ‌చ్చు.

13. ల‌క్ష్మీ – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న: టిటిడి ట్ర‌స్టుల‌కు ద‌శ‌ల‌వారీగా రూ.10 ల‌క్ష‌లు విరాళం ఇచ్చాం. దాత‌ల‌కు ఇచ్చే ప్రివిలేజ్‌లు మాకు కూడా వ‌ర్తిస్తాయా?

ఈవో : దాత‌ల‌కు సంబంధించిన ప్రివిలేజ్‌ల వివ‌రాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. సంబంధిత అధికారి మీతో మాట్లాడి అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తారు.

14. ర‌మాదేవి – తెనాలి

ప్ర‌శ్న : శ్రీ‌వారి ఆల‌యంలో రాత్రి ఏకాంత‌సేవ లైవ్‌లో పాట‌లు వినిపిస్తున్నారు. ఇటీవ‌ల రావ‌డం లేదు.

ఈవో : విరాట‌ప‌ర్వం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌సారమ‌వుతోంది. అధికారుల‌తో చ‌ర్చించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.

15. సాయికుమార్ – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న : శ్రీ‌వారి సుప్రభాత సేవ‌, ఏకాంత సేవ‌ల్లో మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి కూడా అవ‌కాశం వ‌చ్చేలా ఏర్పాట్లు చేయండి.

ఈవో : ఏకాంత సేవ ఏకాంతంగానే జ‌రుగుతోంది. కావున భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు. అన్‌లైన్ డిప్ ద్వారా సామాన్య భ‌క్తుల‌కు కూడా సుప్ర‌భాత సేవ టికెట్లు అందించే విధానం అందుబాటులో ఉంది. ఆర్జిత‌సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించే విష‌య‌మై బోర్డు నిర్ణ‌యం తీసుకుంటుంది. ఆ త‌రువాత సామాన్య భ‌క్తులు కూడా ఎప్ప‌టిలాగే ఆన్‌లైన్ డిప్ ద్వారా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

16. సంధ్య – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న : టిటిడి కార్య‌క్ర‌మాల‌న్నీ బాగున్నాయి. ఆన్‌లైన్ క‌ల్యాణంలో పాల్గొన్న వారికి ర‌క్షా కంక‌ణాలు పంపితే బాగుంటుంది.

ఈవో : క‌ల్యాణం ప్ర‌సాదంలో ఇప్ప‌టికే ర‌క్షాకంక‌ణాలు పంపుతున్నాం.

17. శ్రీ‌నివాస్ – క‌రీంన‌గ‌ర్

ప్ర‌శ్న : వృద్ధుల‌కు శ్రీ‌వారి మూల‌విరాట్ ద‌ర్శనం ద‌గ్గ‌ర‌గా క‌ల్పించండి.

ఈవో : వృద్ధులకు దగ్గ‌ర‌గా ద‌ర్శ‌నం చేయించాల‌నే కోరిక మాకు కూడా ఉంది. అయితే క్షేత్ర‌స్థాయిలో ఇది సాధ్యం కావ‌డం లేదు. గ‌తంలో మ‌హాల‌ఘులో గంట‌కు 5 వేల మంది స్వామివారిని ద‌ర్శించుకునేవారు. ఇపుడు గంట‌కు 1000 మంది దూరం నుంచైనా సంతృప్తిగా ఒక నిమిషం పాటు ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి ఎస్‌.భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

         తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఆదివారం జ‌రిగిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కాగ్‌ :
– టిటిడి ఆదాయ వ్య‌యాల ఆడిటింగ్‌ను ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసేవారు. ఇక‌పై కాగ్ ప‌రిధిలో ఆడిటింగ్ జ‌ర‌గాల‌ని టిటిడి బోర్డు నిర్ణ‌యించింది.

–        పార‌ద‌ర్శ‌క‌త పెంచ‌డంలో భాగంగా ఆగ‌స్టులో బోర్డు స‌మావేశాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు :

– తిరుమల‌ శ్రీవారి సాల‌కట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నాం.

దర్శన టికెట్లు :

– పెర‌టాసి మాసం కార‌ణంగా భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో తిరుపతిలో రోజుకు 3 వేల‌ చొప్పున ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లను సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల‌ చేయడమైనది.

– ఆన్‌లైన్‌లో కోటా పెంచి రోజుకు 13 వేల‌ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేస్తున్నాం. నిధుల కోస‌మే టిటిడి ఇలా చేస్తోంద‌ని సామాజిక మాధ్య‌మాల్లో జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేదు.

ఆన్‌లైన్‌ కల్యాణోత్సవం గృహస్తుల‌కు శ్రీవారి దర్శనం :

– ఆన్‌లైన్‌ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్‌ బుక్‌ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించాం.

ప్రోటోకాల్‌ బ్రేక్‌ దర్శనం :

– కోవిడ్‌ కారణంగా శ్రీవారి ఆర్జిత సేల‌ను రద్దు చేయడం వ‌ల్ల‌ ఇప్పటికే ఉదయాస్తమాన సేవ మరియు వింశతి వర్ష దర్శిని(వివిడి) పథకాల‌ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తుల‌కు ప్రోటోకాల్‌ విఐపి బ్రేక్‌ దర్శనం కల్పిస్తాం.

గీతా పారాయణం :

– లోకకల్యాణార్థం తిరుమల‌లోని నాదనీరాజనం వేదికపై సెప్టెంబర్‌ 10వ తేదీ నుండి గీతా పారాయణం ప్రారంభించాం. సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం పారాయ‌ణాన్ని ఎస్వీబీసీ ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వీక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.