పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో టీటీడీ 

పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో టీటీడీ

తిరుమల 24 ఏప్రిల్ 2023: తిరుపతి లో టీటీడీ భక్తుల కోసం సేవలందిస్తున్న వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయి. కాబట్టి వీరు ఆందోళన కు దిగడానికి ముందుగానే యాజమాన్యానికి తెలియజేయాలి. అలాకాకుండా భక్తులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి 24 గంటల్లోగా వీరు తమ విధుల్లో చేరక పోతే యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఈ విషయమై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది