KARVETINAGARAM BRAHMOTSAVAMS _ మే 13 నుండి 21వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 

TIRUPATI, 24 APRIL 2023: The annual brahmotsavams in Sri Venugopala Swamy temple at Karvetinagaram is scheduled between May 13 to 21 with Ankurarpanam on May 12 and Koil Alwar Tirumanjanam on May 9.

 

The important days includes Dhwajarohanam on May 13, Kalyanotsavam on May 16 Garuda Seva on May 17, Rathotsavam on May 20, Chakrasnanam on May 21 and Pushpayagam on May 22.

 

The devotees shall participate in Kalyanam on payment of Rs.750 per ticket on which two persons will be allowed.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 13 నుండి 21వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 24 ఏప్రిల్ 2023: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 13 నుండి 21వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. మే 12వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 22వ తేదీన మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

13-05-2023 ధ్వజారోహణం(కర్కాటక లగ్నం) పెద్దశేష వాహనం

14-05-2023 చిన్నశేష వాహనం హంస వాహనం

15-05-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

16-05-2323 కల్పవృక్ష వాహన ఆర్జితకళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం

17-05-2023 మోహినీ అవతారం గరుడ వాహనం

18-05-2023
హనుమంత వాహనం
గజ వాహనం

19-05-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

20-05-2023 రథోత్సవం అశ్వవాహనం

21-05-2023 చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో మే 16వ తేదీ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.