PAVITROTSAVAMS CONCLUDES WITH PURNAHUTI _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
Srinivasa Mangapuram, 13 Nov. 20: The annual Pavitrotsavams in Srinivasa Mangapuram concluded with Purnahuti on Friday night.
TTD JEO Sri P Basanth Kumar, temple DyEO Smt Shanti, AEO Sri Dhananjayulu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2020 నవంబరు 13: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. తిరుమంజనంలో స్వామి అమ్మవార్లను తులసి, వివిధ సాంప్రదాయ పుష్ప మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం సమర్పణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చక బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.