PEDDA SESHA VAHANAM HELD _ పెద్దశేష వాహనంపై  గోవిందుడి కటాక్షం 

TIRUPATI, 26 MAY 2023: As part of ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati, the Vahana Sevas commenced with Pedda Sesha Vahanam on Friday evening.

 

Sridevi, Bhudevi sameta Sri Govindaraja Swamy atop the seven-hooded Serpent King carrier proceeded all along the four mada streets encircling the ancient temple on a pleasant evening.

 

Devotees offered Haratis to the processional deities with religious ecstasy chanting “Govinda…Govinda”. 

 

DyEO Smt Shanti, AEO Sri Ravi Kumar and other office staff, large number of devotees participated.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పెద్దశేష వాహనంపై  గోవిందుడి కటాక్షం
 
తిరుపతి, 2023 మే 26: తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 గంటల నుండి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిందరాజస్వామి   భక్తులను క‌టాక్షిచారు.  
 
బ్రహ్మోత్సవాల్లో  స్వామివారి మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో స్వామివారిని స్తుతిస్తూ,  మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. విశ్రాంతికి  సుఖనిద్రకు కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.
 
వాహన సేవలో  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ రవికుమార్,  సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.