SRI KALYANA VENKATESWARA SHINES AS VAIKUNTANATHA ON PEDDA SESHA VAHANAM _ పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Tirupati,11 February 2023: On the first day of the ongoing annual Brahmotsavam at Srinivasa Mangapuram temple, Sri Kalyana Venkateswara Swamy along with His consorts Sridevi and Bhudevi blessed devotees on Pedda Sesha vahanam in  Vaikuntanatha alankaram.

Devotees were thrilled at the majestic display of the procession with bulls, horses, elephants, Mangala vaidyam along with Kolata, bhajans, etc. on a pleasant evening on Saturday.

TTD JEO Sri Veerabrahmam, temple Special Grade DyEO Smt Varalakshmi, Kankanabhattar Sri Balaji Rangacharyulu, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayulu, Temple inspector Sri Kiran Kumar Reddy, other officials and devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి 11ఫిబ్రవరి 2023: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శనివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.

వాహ‌న‌సేవ‌లో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు, కంకణభట్టార్‌
శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల