ప్రణబ్ మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం

ప్రణబ్ మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం.

తిరుపతి 31 ఆగస్టు 2020: భారతరత్న , మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన వ్యక్తిత్వం వల్ల కింది స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఆయన ఎదిగారని శ్రీ వైవి కొనియాడారు. వివిధ పదవుల్లో ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని చెప్పారు .శ్రీ ప్రణబ్ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. శ్రీ ప్రణబ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది