SAHASRA PURUSHA VEDASWASTI BY TTD IN FEBRUARY _ ఫిబ్ర‌వ‌రిలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం- టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 14 December 2023: TTD is organising yet another prestigious and unique Dharmic programme, Sahasra Purusha Vedaswasti in the first week of February 2024 in the Parade Grounds behind the TTD Administrative Building to impart knowledge of Four Vedas to humans for a hassle-free living.

Addressing a review meeting on the subject at the TTD Administrative Building on Thursday evening the JEO for Health and Education Smt Sada Bhargavi asked the officials to make all arrangements including inviting eminent Vedic scholars from all over the country besides the scheme Parayanadars of the Sri Venkateswara Institute of Higher Vedic Studies.

Among others, the officials were asked to coordinate with all departments to organise committees for the management of food, medicine, accommodation, programming, transport etc.

Acharya Rani Sadasiva Murthy, the Vice Chancellor of SVVU, Registrar Sri Radhesyam, CAuO Sri Sesha Shailendra, Dharmic Projects program officer Sri Rajagopal, HDPP Secretary Sri Somayajulu, SVIHVS  special officer Dr Akella Vibhishana Sharma were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రిలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం-⁠ ⁠టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 14: ధర్మప్రచారంలో భాగంగా నాలుగు వేదాల సారాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహిస్తామని, ఇందుకోసం అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేప‌ట్టాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై తిరుపతిలోని పరిపాలన భవనంలో గురువారం అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ లోక‌క్షేమం కోసం ప్ర‌జ‌లంద‌రికీ శాంతి సౌభాగ్యాలు, ఆరోగ్యం, అభ్యుద‌యం క‌ల‌గాల‌ని ఆకాంక్షిస్తూ ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని కోరారు. ఇందుకోసం దేశంలోని వివిధ‌ ప్రాంతాల నుండి ప్రముఖ పండితులను ఆహ్వానించాలన్నారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలోని స్కీమ్‌ పారాయణదారులను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. మూడు రోజులపాటు నిర్వ‌హించే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా విభాగాల‌ అధికారులు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆహారం, వైద్యం, బస, కార్యక్రమ నిర్వ‌హ‌ణ‌, రవాణా తదితర కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్‌ శ్రీ రాధేశ్యామ్‌, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ సోమయాజులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయబడినది.