ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వరకు  శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
 
తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
 
మొదటి రోజు శ్రీ కోదండరామ స్వామివారు, రెండో రోజు శ్రీ పార్థసారథిస్వామి వారు, మూడో రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, నాలుగో రోజు ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, చివరి మూడు రోజులు శ్రీ గోవిందరాజ స్వామి వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.