TIRUMALA SECOND GHAT ROAD TO BE CLOSED FROM FEB 11 TO MARCH 31 _ ఫిబ్రవరి 11 నుండి మార్చి 31 వరకు రెండవ ఘాట్‌రోడ్డు తాత్కాలికంగా మూసివేత
TIRUMALA, FEB 3: The second ghat road leading from Tirupati to Tirumala, will be temporarily closed from February 11 to March 31 in connection with the ghat road renovation works taken up by TTD.
Laying of BT road works at an estimated cost of Rs.4.15cr will commence from Sri Vinaya Temple located at the beginning of the second ghat road to GNC toll gate at Tirumala stretching to a length of about 15.5km.
The vehicular traffic will not be allowed from 9am till 6pm on these days. In the remaining hours the traffic will be permitted as usual. However the link road works will commence from February 7 and will be completed on February 10. During this time there will not be any ghat road vehicular restriction.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 11 నుండి మార్చి 31 వరకు రెండవ ఘాట్‌రోడ్డు తాత్కాలికంగా మూసివేత
తిరుపతి, ఫిబ్రవరి 03, 2011: తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళు రెండవ ఘాట్‌రోడ్డు మరమత్తుపనులు ప్రారంభంకానున్న నేపద్యంలో ఫిబ్రవరి 11వ తారీఖు నుండి మార్చి 31వ తారీఖు వరకు ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. రెండవ ఘాట్‌రోడ్డు ప్రారంభంలో వున్న వినాయకస్వామి వారి గుడి మొదలుకొని తిరుమలలోని జి.ఎన్.సి. టోల్‌గేట్ వరకు 15.5 కి.మీ. మేర రూ.4.15 కోట్లతో బిటిరోడ్డు వేయనుండడంతో ఈ రెండవ ఘాట్‌రోడ్డును తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. అయితే ఈ మూసివేత కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే వర్తిస్తుంది. మిగిలిన సమయంలో యధాప్రకారం వాహనాలు అనుమతించబడతాయి. కాగా ఫిబ్రవరి 7 నుండి 10వ తారీఖు వరకు లింకురోడ్డు నిర్మాణపు పనులు జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఘాట్‌రోడ్డులో వాహనాలు యధాప్రకారము అనుమతించ బడతాయి.
రేపు తిరుమలలో ”డయల్‌యువర్ ఇఓ” కార్యక్రమం
తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతి నెలా తొలి శుక్రవారం భక్తుల కొరకు నిర్వహించే డయల్ యువర్ ఇఓ కార్యక్రమం ఫిబ్రవరి 4వ తేదిన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు భక్తులతో ముఖాముఖి టెలిఫోన్ కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తులు ఈ కార్యక్రమం ద్వారా తమకున్న సందేహాలను నివృత్తిచేసుకోవడమే కాకుండా ఏదైనా సమస్యలు ఎదుర్కొని వుంటే వాటిని తితిదే అధికారుల దృష్ఠికి తీసుకొని రావడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. అంతేకాకుండా భక్తులు తితిదేకి తమ సూచనలుకకూడా అందించవచ్చు. ఈ కార్యక్రమం ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల మధ్యలో జరుగుతుంది. కాగా భక్తులు తమ సందేహాలు, సూచనలు తెలియపరచడానికి సంప్రదించవలసిన ఫోన్ నెం.(0877) 2263261.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.