ఫిబ్రవరి 14న శ్రీరామాలయం మహాసంప్రోక్షణ

ఫిబ్రవరి 14న శ్రీరామాలయం మహాసంప్రోక్షణ

తిరుపతి, ఫిబ్రవరి 12,2013: తితిదేకి అనుబంధంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా, గణపవరం మండలం, సరిపల్లెలోని శ్రీ రామాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 14వ తేదీన ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
ఇందులో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన ఉదయం ఆచార్యవరణం, అకల్మష హోమం, శాంతి హోమం, రాత్రి అంకురార్పణ, కలశస్థాపన చేపట్టారు. ఫిబ్రవరి 13న ఉదయం యాగశాల కైంకర్యాలు, అభిషేకం, రాత్రి యాగశాల కైంకర్యాలు, శయనధవసం జరుగనున్నాయి. ఫిబ్రవరి 14న విగ్రహస్థాపన, అష్టబంధనం, అభిషేకం, అలంకరణ, పూర్ణాహుతి, ఆలయ ప్రదక్షిణ, ఆవాహన తదితర కార్యక్రమాలతో మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.