SKVST BRAHMOTSAVAMS IN FEBRUARY _ ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 18 Jan. 20: The annual brahmotsvams of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram will commence from February 14 on wards with Ankurarpanam on February 13.

The important days includes Dhwarajrohanam February 14,  Garudaseva on February 18, Swarnaratham on February 19, Rathtosavam on February 21 and Chakrasnanam on February 22.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

పత్రికా ప్రకటన                                             తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 18

ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

 తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 18: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                   ఉదయం సాయంత్రం

14-02-2020(శుక్ర‌వారం)          ధ్వజారోహణం                         పెద్దశేష వాహనం

15-02-2020(శ‌నివారం)            చిన్నశేష వాహనం                     హంస వాహనం

16-02-2020(ఆదివారం)            సింహ వాహనం                   ముత్యపుపందిరి వాహనం

17-02-2020(సోమ‌వారం)         కల్పవృక్ష వాహనం       సర్వభూపాల వాహనం

18-02-2020(మంగ‌ళ‌వారం)      పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం)   గరుడ వాహనం

19-02-2020(బుధ‌వారం)        హనుమంత వాహనం            స్వర్ణరథం, గజ వాహనం

20-02-2020(గురువారం)          సూర్యప్రభ వాహనం             చంద్రప్రభ వాహనం

21-02-2020(శుక్ర‌ వారం)         రథోత్సవం                             అశ్వవాహనం

22-02-2020(శ‌నివారం)            చక్రస్నానం                        ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

ఫిబ్రవరి 6న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 11.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడ, కళ్యాణోత్సవంలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.