ఫిబ్రవరి 16వ తేది నుండి 25వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 16వ తేది నుండి 25వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుపతి ఫిబ్రవరి-7,2009: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16వ తేది నుండి 25వ తేది వరకు వైభవంగా నిర్వహిస్తారు. అంకురార్పణ ఫిబ్రవరి 15వ తేదిన నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా 16వ తేదిన ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. 24వ తేదిన ఆలయంలో నిర్వహించే శివపార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొను గృహస్థులు రూ.250/-లు చెల్లించి పాల్గొనవచ్చును. బ్రహ్మోత్సవాలలో తి.తి.దే ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక, హరికథా కార్యక్రమములు ఏర్పాటుచేస్తారు.
శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో నూతన సేవలు
శ్రీకపిలేశ్వరస్మామివారి ఆలయంలో శ్రీవినాయకస్వామి వారికి సంకటహర చతుర్థశి ఉత్సవం ఆర్జితసేవగా ప్రతినెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థశి రోజున నిర్వహిస్తారు. ఈ సేవకు ఒక్కొక్కరు రూ.50/-లు చెల్లించి పాల్గొనవచ్చును. ఫిబ్రవరి 12వ తేది నుండి ఆలయంలో ఈ సేవ ప్రారంభం అవుతుంది.
అదేవిధంగా శ్రీకామాక్షి అమ్మవారికి స్నపన తిరుమంజనం సేవను నిర్వహిస్తారు. ఈసేవకు ఒక్కొక్కరు రూ.100/-లు చెల్లించి పాల్గొనవచ్చును. అంతేగాక చందన అలంకారంతో కూడిన శ్రీకామాక్షి అమ్మవారికి జరిగే ఊంజల్ సేవలో పాల్గొనదలచిన భక్తులు ఒక్కొక్కరు రూ.50/-లు చెల్లించి పాల్గొనవచ్చును.
ఫిబ్రవరి 7వ తేదిన శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 121వ జయంతి సందర్భంగా శ్వేత భవనమునకు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి తి.తి.దే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీవి.శేషాద్రి పుష్పాంజలి ఘటించారు. వీరితోపాటు శ్వేత డైరెక్టర్ శ్రీభూమన్, వేటూరి ప్రభాకరశాస్త్రి కుమారుడు శ్రీవేటూరి అనందమూర్తి, తరిగొండ వెంగమాంబ కృతుల పరిష్కర్త శ్రీకె.జె.కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.