ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు కోసువారిపల్లి  శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు కోసువారిపల్లి  శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 13,2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం
20-02-13(బుధవారం) ధ్వజారోహణం(మీనలగ్నం) ———
24-02-13(ఆదివారం) మోహినీ ఉత్సవం గజ వాహనం
25-02-13(సోమవారం) కల్యాణోత్సవం గరుడ వాహనం
26-02-13(మంగళవారం) ——— రథోత్సవం
27-02-13(బుధవారం) పార్వేట ఉత్సవం అశ్వ వాహనం
28-02-13(గురువారం) వసంతోత్సవం,
చక్రస్నానం ధ్వజావరోహణం

ఉత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు ఉదయం 9.00 గంటల నుండి 10.30 గంటల వరకు, సాయంత్రం 6.00 గంటల నుండి 10.30 గంటల వరకు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు. ఊంజల్‌సేవ తరువాత తరిగొండ వెంగమాంబ సంకీర్తనల ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
    
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.