ఫిబ్రవరి 26న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు 

ఫిబ్రవరి 26న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు

తిరుపతి, ఫిబ్రవరి 15, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 26వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
 
శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థానం నిర్వహించడం ప్రతి ఏడాదీ ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో తితిదే హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.