ఫిబ్రవరి 7న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 122వ జయంతి వేడుకలు
ఫిబ్రవరి 7న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 122వ జయంతి వేడుకలు
తిరుపతి, 2010 ఫిబ్రవరి 04 : ప్రముఖ కవి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 122వ జయంతి వేడుకలు ఈనెల 7వ తేదిన స్థానిక అన్నమాచార్య కళామందిరం నందు ఘనంగా జరగనున్నవి.
వేటూరి ప్రభాకరశాస్త్రి 122వ జయంతి సందర్భంగా 7వ తేది ఉదయం 10 గంటలకు స్థానిక శేతభవనం ఎదురుగావున్న వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహానికి తితిదే బోర్డు చైర్మన్, కార్యనిర్వహణ అధికారి, ఇతర ప్రముఖులు పూల మాలలు వేసి ఘనంగా నివాళిలు అర్పిస్తారు.
అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు అన్నమాచార్య కళామందిరం నందు ఆయన రచించిన పుస్తక ఆవిస్కరణ వుంటుంది. అనంతరం ఆయన జీవితగాధపై వక్తల ప్రసంగం వుంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.