EXTENSIVE ARRANGEMENTS IN FULL WING FOR RATHA SAPTHAMI- ADDNL.EO _ ఫిబ్ర‌వ‌రి 1న రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 21 January 2020: Elaborate arrangements are underway to observe Surya Jayanthi or One day Upa Brahmotsavams on the auspicious day of Rathasapthami on February 1, said TTD additional Executive Officer Sri AV Dharma Reddy.

After a review meeting at Annamaiah Bhavan on Tuesday with senior officers in Tirumala over the on-going arrangements for the yet another big occasion which is just ten days away, the Additional EO directed all HoDs to complete the works as per time schedule.

Later speaking to media he said there were inscriptions to say that Ratha Saptami was grandly celebrated every year since 1564.

He said on that day the deity of Sri Malayappa Swamy is paraded on seven Vahanams beginning with Surya Prabha vahanam in the morning and culminating with Chandraprabha Vahanam at the night.

The galleries of Mada streets will be packed with devotees from morning 0400 am till 9.00: pm at night. TTD had plans to lay German sheds in Mada streets to facilitate the devotees against cold and hot weather. 

Elaborate discussions are also held with Annaprasadam, Health and security departments. The event will be telecast live on SVBC channel, besides all-out efforts to keep Tirumala clean and also a bouquet of cultural programs in front of vahanams.

He also directed officials to make foolproof security arrangements in coordination with local police besides deployment of 3500 Srivari Sevakulu, 300 scouts and guides.

TTD has also cancelled all arjita sevas like Kalyanotsavam, unjal Seva, Brahmotsavams, Vasantotsavam, Sahasra Deepalankara Seva on that holy festival day. 

Similarly, the TTD has also cancelled all privileged darshans tokens like senior citizens, challenged and parents with infants, he maintained.

DETAILS OF VAHANA SEVAS ON RATHA SAPTHAMI DAY:

Surya Prabha Vahanam: 05.30am- 08.00 am

Chinna Sesha Vaanam  : 09.00am- 10.00 am

Garuda Vahanam         : 11.00am -12.00 noon

Hanumanta Vahanam   : 01.00pm- 02.00 pm

Chakra snanam            : 02.00pm- 03.00 pm

Kalpavruksha Vahanam : 04.00pm-05.00 pm

Sarva bhoopala Vahanam:  06.00pm- 07.00 pm

Chandra Prabha Vahanam: 08.00pm- 09.00 pm. 

Addl CVSO Sri Sivakumar Reddy, SE-2 Sri Nageswar Rao, Estate officer Sri Vijaysaradhi, Transport GM Sri Sesha Reddy, CMO Dr Nageswar Rao, Health Officer DrRR Reddy, Annaprasadam DyEO Sri Nagraju, Reception DyEOs Sri Balaji, Sri Damodaram, KKC DyEO Sri Selvam, Garden Superintendent Sri Srinivasulu participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 1న రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

 తిరుమల, 2020 జ‌న‌వ‌రి 21: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1న‌ రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ర‌థ‌స‌ప్త‌మి ఏర్పాట్ల‌పై అద‌న‌పు ఈవో సమీక్ష నిర్వహించారు.

స‌మావేశం అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తిఏటా మాఘ శుద్ధ స‌ప్త‌మినాడు తిరుమ‌ల‌లో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. క్రీ.శ 1564 నుండి తిరుమ‌ల‌లో ఈ ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు శాస‌నాధారాలు ఉన్నాయ‌ని తెలిపారు. శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఒకేరోజు ఏడు ప్ర‌ధాన వాహ‌నాల‌పై ఊరేగే కార‌ణంగా దీన్ని ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వాల‌ని, ఉప బ్ర‌హ్మోత్స‌వాల‌ని పిలుస్తార‌ని వివ‌రించారు. సూర్య‌ప్ర‌భ వాహ‌నంతో మొద‌లై రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నంతో వాహ‌న‌సేవ‌లు ముగుస్తాయ‌ని తెలిపారు. వాహన సేవ‌లను తిలకించేందుకు ఉదయం 4 నుండి రాత్రి 9 గంటల వరకు గ్యాలరీల్లో భ‌క్తులు వేచి ఉంటార‌ని, ఎండ‌కు ఇబ్బందిప‌డ‌కుండా జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటుచేశామ‌ని, టి, కాఫి, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు నిరంతరాయంగా పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు తిల‌కించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని అద‌న‌పు ఈవో తెలిపారు. మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. టిటిడి నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఆదేశించామ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 3500 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవ‌లను వినియోగించుకుంటామ‌ని తెలిపారు. ఈ ప‌ర్వ‌దినం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవలను రద్దయ్యాయ‌ని, సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించారు. అదేవిధంగా, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాత‌ల‌కు ప్రత్యేక దర్శనాలను ర‌ద్దు చేశామ‌ని తెలిపారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు : 

సూర్యప్రభ వాహనం       ఉదయం      5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు

చిన్నశేష వాహనం          ఉదయం         9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం              ఉదయం         11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం      మధ్యాహ్నం 1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం                   మధ్యాహ్నం 2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు

కల్పవృక్ష వాహనం         సాయంత్రం  4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం     సాయంత్రం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం        రాత్రి                 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ముఖ్య వైద్యాధికారి డా. నాగేశ్వ‌ర‌రావు, ఆరోగ్యవిభాగం అధికారి డా|| ఆర్ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ నాగ‌రాజ‌, శ్రీ బాలాజి, శ్రీ దామోద‌రం త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.