TTD TO MASSIVE SARASWATHI YAGAM ON FEB 20 FOR STUDENTS _ ఫిబ్రవరి 20న తిరుపతిలో మహాసరస్వతియాగం
OVER 10K STUDENTS TO TAKE PART IN GITA MAIDANAM
Tirupati, 15 Feb. 20: As a part of the propagation of Hindu Sanatana Dharma, TTD is set to organize Saraswathi Maha Yagam with 10 thousands students on February 20 in Tirupati under the aegis of Hindu Dharma Prachara Parishad (HDPP).
This mass event is aimed at the students to perform well in their upcoming exams and excel in their future career. The students belonging to TTD and Government educational institutions from Class Eighth to Degree shall take part in this Maha Yagam which will be conducted in the spacious Geeta Maidanam (SV High School Grounds) in Tirupati.
The programme will commence at 3pm and conclude by 7pm on Thursday and rituals including Anujna Punyaham, Saraswati Devi Aradhana, Kalasharadhana, Maha Saraswati Yoga and Purnahuti will be performed.
During the Saraswathi Yagam, the copies of Saraswati Mantra will be distributed to the students to recite during the Purnahuti event.
After the Yagam, “Vidya Kankanams” (Sacred Threads tied to the hands), a book and a pen to all students will be presented at the event wishing them success.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 20న తిరుపతిలో మహాసరస్వతియాగం
10 వేల మంది విద్యార్థులకు సరిపడా ఏర్పాట్లు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 15: ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, విద్యా విభాగం సంయుక్తాధ్వర్యంలో ఫిబ్రవరి 20న తిరుపతిలోని గీతాజయంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) మహాసరస్వతి యాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు అనుజ్ఞ పుణ్యాహం, సరస్వతీ దేవి ఆరాధన, కలశారాధన, మహాసరస్వతీ యాగం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. త్వరలో జరుగనున్న వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు విజయం సాధించాలని శ్రీ సరస్వతి అమ్మవారిని ప్రార్థించేందుకు ఈ యాగం తలపెట్టారు. సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొనేందుకు వీలుగా టిటిడి ఏర్పాట్లు చేపడుతోంది.
టిటిడి విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ధార్మిక సంస్థల్లో 8, 9, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విదార్థులు ఈ యాగంలో పాల్గొనవచ్చు. పూర్ణాహుతి సమయంలో పఠించేందుకు వీలుగా విద్యార్థులకు సరస్వతి మంత్రం కాపీలను సరఫరా చేస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులతో ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. పాల్గొన్న విద్యార్థులందరికీ విద్యాకంకణం, పుస్తకం, పెన్ను అందజేస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.