KSHETRAPALAKA MAHASIVARATRI UTSAVAM IN TIRUMALA ON FEBRUARY 21 _ ఫిబ్ర‌వ‌రి 21న తిరుమలలో క్షేత్రపాలకుడికి మ‌హాశివ‌రాత్రి

Tirumala, 10 Feb. 20: On the auspicious occasion of Mahasivaratri festival on February 21, Kshetrapalaka Utsavam will be observed in Tirumala. 

Though hill temple happens to be a world renowned Vaishnava temple, the Custodian-Kshetrapalaka happens to be Lord Shiva hence standing as a live stance for “Shiva-Kesava Abedha”(no difference between Lord Shiva and Lord Maha Vishnu). 

On this day, a team of archakas reach Gogarbham dam and perform special abhishekam to the presiding deity of Rudra who is located here by chanting Namaka, Chamakas. Later the also distribute prasadam to devotees and return to temple. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

ఫిబ్ర‌వ‌రి 21న తిరుమలలో క్షేత్రపాలకుడికి మ‌హాశివ‌రాత్రి

ఫిబ్రవరి 10, తిరుమల 2020: తిరుమలలోని గోగర్భం సమీపంలో వెల‌సిన‌ రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. సుగంధ‌ద్రవ్యాలతో క్షేత్ర‌పాల‌కునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.