RATHA SAPTHAMI IN EKANTHAM AT TIRUMALA ON FEBRUARY 8 _ ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

Tirumala, 31 Jan. 22: As part of the Surya Jayanti celebrations, TTD is organising the Ratha Sapthami festival in Ekantam inside the Srivari temple on February 8 in view of Covid restrictions.

 

Following are vahana sevas scheduled on the occasion:

 

Surya Prabha vahanam – 6am to 8am(6:43am)

 

Chinna Sesha vahana at 9am and 10am

Garuda Vahana 11am and 12noon

Hanumanta vahana 1pm and 2 pm

Chakra Snanam at Ranganayakula Mandapam 2pm and 3pm

Kalpavruksha vahanam 4pm and 5 pm

Sarva Bhupala vahanam 6pm and 7pm

Chandra Prabha vahanam 8pm and 9pm 

 

In view of festivities throughout the day, the TTD has cancelled all arjita sevas including Unjal seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara sevas on the day.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

తిరుమ‌ల‌, 31 జనవరి 2022: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం ఉదయం 6 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.43 గంట‌ల‌కు)

చిన్నశేష వాహనం ఉదయం 9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం ఉదయం 11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం మధ్యాహ్నం 1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం మధ్యాహ్నం 2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు (రంగనాయకుల మండపంలో)

కల్పవృక్ష వాహనం సాయంత్రం 4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం రాత్రి 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

ఆర్జిత సేవలు రద్దు

ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఫిబ్రవరి 8న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా రథసప్తమి

ఫిబ్రవరి 8వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ర‌థస‌ప్త‌మి ఏకాంతంగా జ‌రుగ‌నుంది. ఆల‌యం వ‌ద్ద గ‌ల వాహ‌న‌మండ‌పంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

సూర్యప్రభ వాహనం ఉదయం 7 గం||ల నుంచి 7.30 గం||ల వరకు

హంస‌ వాహనం ఉదయం 8 గం||ల నుంచి 8.30 గం||ల వరకు

అశ్వ‌ వాహనం ఉదయం 9 గం||ల నుంచి 9.30 గం||ల వరకు

గరుడ వాహనం ఉదయం 9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

చిన్న‌శేష వాహనం ఉదయం 10 గం||ల నుంచి 10.30 గం||ల వరకు

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మధ్యాహ్నం 3 గం||ల నుంచి 4.30 గం||ల వరకు (శ్రీకృష్ణ ముఖ మండపంలో)

చంద్రప్రభ వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 6.30 గం||ల వరకు

గ‌జ వాహనం రాత్రి 7.30 గం||ల నుంచి 8 గం||ల వరకు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లను టిటిడి రద్దు చేసింది.

అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.