CLEFT LIP & CLEFT PALATE SURGERIES BEGINS AT BIRRD HOSPITAL _ బర్డ్ ఆసుపత్రిలో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు ప్రారంభం

FIVE SUCCESSFUL OPERATIONS ON THE FIRST DAY

Tirupati,13 September 2022: The BIRRD hospital performed five cleft lip & cleft palate surgeries on Tuesday successfully on the day one of the new mission for curing infants.

 

The procedures were performed by the eminent Dr Krishnamurthy from Bangalore and Dr Jhansi, plastic surgeon of BIRRD hospital.

 

The BIRRD  hospital is now equipped to perform critical Cleft Lip & Cleft Palate operations on children above three months. Besides providing free treatment TTD has also offered free transport charges to patients and their dependents.

 

In the event, such patient suffered from other hereditary ailments TTD offered to treat them after tests.

 

TTD is also organising infrastructure and procedures for deaf and dumb infants.

 

For Cleft Lip & Cleft Palate operations the patients should register their names between MondayFriday from morning 8 am to afternoon 12 noon on registered Mobile No. 7337318107 in advance.

 

Without Adhaar card or Arogyasree card and without differentiation of rich or poor all such operations are performed freely in the BIRRD hospital.

 

OSD of BIRRD hospital Dr Reddappa Reddy said TTD intends to perform a minimum of 100 such operations every month.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బర్డ్ ఆసుపత్రిలో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు ప్రారంభం

– తొలిరోజు విజ‌య‌వంతంగా ఐదుగురికి శస్త్రచికిత్సలు

తిరుపతి, 13 సెప్టెంబరు 2022: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో మంగ‌ళ‌వారం నుండి ఉచితంగా గ్రహణమొర్రి (Cleft Lip and Cleft Palate surgery) శస్త్రచికిత్సలు ప్రారంభ‌మ‌య్యాయి. బెంగ‌ళూరుకు చెందిన ప్ర‌ముఖ వైద్యులు డాక్ట‌ర్ కృష్ణ‌మూర్తి, బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఝాన్సీ నేతృత్వంలో తొలిరోజు ఐదుగురికి విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హించారు.

మూడు నెల‌ల వ‌య‌సు దాటిన చిన్నారుల నుంచి ఏ వ‌య‌సు వారికైనా గ్ర‌హ‌ణ‌మొర్రి శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హిస్తారు. దేశంలోని ఏ ప్రాంతంవారికైనా ఉచితంగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హించ‌డంతోపాటు ర‌వాణా ఛార్జీలు కూడా అందిస్తారు. గ్ర‌హ‌ణ‌మొర్రి బాధితుల‌కు కొన్ని జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల ఇత‌ర వ్యాధులు కూడా ఉండే అవ‌కాశ‌ముంది. శ‌స్త్రచికిత్స‌ల స‌మ‌యంలో జ‌రిపే ప‌రీక్ష‌ల్లో ఇలాంటి వ్యాధులు గుర్తిస్తే వాటికి కూడా ఉచితంగా చికిత్స‌లు చేస్తారు. చెవుడు, మూగవారికి కూడా ప్ర‌త్యేకంగా ఆప‌రేష‌న్లు నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్ర‌హ‌ణ‌మొర్రి శ‌స్త్రచికిత్స‌ల కోసం సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల  వరకు 7337318107 నంబ‌రుకు ఫోన్ చేసి ముంద‌స్తుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్‌కార్డు, ఆరోగ్య‌శ్రీ‌కార్డుతో అవ‌స‌రం లేకుండా పేద, ధ‌నిక తేడా లేకుండా అవ‌స‌ర‌మైన వారంద‌రికీ ఉచితంగా శ‌స్త్రచికిత్స‌లు చేస్తారు. ప్ర‌తినెలా 100కు త‌గ్గ‌కుండా శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచ‌ప‌ల్లి రెడ్డెప్పరెడ్డి తెలిపారు.
 
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.