AP GUV VISITS BIRRD AND CHILDREN HOSPTIAL _ బ‌ర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల‌ను ప‌రిశీలించిన – రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్

Tirupati, 26 April 2024:  The honourable Governor of AP Sri Abdul Nazeer on Friday visited the TTD-run BIRRD hospital and Sri Padmavati Children’s Heart Centre. 

Earlier at BIRRD hospital he went around the outpatient, ICU, operation theatres and artificial limbs making units for bone and kneecap replacements.

Thereafter he visited the Children’s Cardiac Hospital where infants with heart ailments were treated, cath labs, ICU and others wings besides interacting with patients, their parents and lauded the TTD for providing free treatment to the poor patients.

He also expressed happiness at all the  Medicare services of TTD.

TTD JEOs Smt Gautami, Sri Veerabrahmam felicitated the visiting dignitaries with shawls.

BIRRD OSD Dr Reddappa Reddy, Children’s Hospital Director Dr Srinath Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బ‌ర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల‌ను ప‌రిశీలించిన – రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్

తిరుపతి, 2024 ఏప్రిల్ 26: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ బ‌ర్డ్‌, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల‌ను రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ దంప‌తులు శుక్ర‌వారం సందర్శించారు.

ముందుగా బర్డ్ ఆసుపత్రిని సందర్శించి, నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్స, ఐసియు, ఔట్‌పేషెంట్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులను, డిజిట‌ల్ ఎక్స్‌రే, సిటి స్కాన్, కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ, అమ‌రిక కేంద్రాన్ని పరిశీలించారు.

అనంత‌రం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వార్డుల్లో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ తదితర వార్డులను రాష్ట్ర గవర్నర్‌ సందర్శించి, రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా గౌ|| రాష్ట్ర గవర్నర్ టీటీడీ అందిస్తున్న‌ సౌక‌ర్యాల‌ను రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

త‌రువాత‌ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ దంప‌తుల‌ను టీటీడీ జేఈవోలు శ్రీ‌మ‌తి గౌత‌మి, శ్రీ వీర‌బ్ర‌హ్మం సాలువ‌తో స‌న్మానించారు.

ఈ కార్యక్రమంలో బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్ర‌త్యేకాధికారి శ్రీ రెడ్డప్ప రెడ్డి, శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది