TTD JEO INSPECTS INSTITUTIONS _ బాలమందిర్, బధిర పాఠశాల, కళాశాలను తనిఖీ చేసిన జెఈవో
Tirupati, 17 Mar. 21: TTD Joint Executive Officer Smt Sada Bhargavi on Wednesday evening inspected the SV Bala mandir, Deaf and Dumb school and directed officials, students, teachers and hostel wardens to focus on keeping the surroundings clean and green in view of Covid and also keep watch on students’ health.
The TTD JEO went around the hostel kitchen, student’s rooms, toilets, bathrooms and also classrooms in all the institutions and directed immediate steps for cleanliness and social distancing everywhere.
She directed engineering officials to take up whitewashing and also promote greenery and beautification at the Bala mandir.
TTD DEO Sri Govindarajan, TTD Forest officer Sri Chandrasekhar was present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి
– పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి
బాలమందిర్, బధిర పాఠశాల, కళాశాలను తనిఖీ చేసిన జెఈవో
తిరుపతి 18 మార్చి 2021: కోవిడ్ 19 నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్లు విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశించారు.
టీటీడీ కి చెందిన ఎస్వీ బాల మందిర్, ఎస్వీ బధిర పాఠశాల, కళాశాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు.
హాస్టళ్లలోని వంట గదులు, విద్యార్థుల వసతి గదులు, తరగతి గదులను ఆమె పరిశీలించారు. హాస్టల్ గదుల్లో విద్యార్థుల మంచాల మధ్య దూరం ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు దుస్తులు వారి గదుల్లో ఆరేసుకునేలా కాకుండా, బహిరంగ ప్రదేశంలో ఎండ పడేలా ఆరేసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో పరిశుభ్రతను పరిశీలించారు. బాలమందిర్ భవనాలకు వెంటనే సున్నం కొట్టించాలని ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డిని ఆదేశించారు. బాలమందిర్ లో పూల మొక్కలు పెంచి సుందరీకరణ చేయాలన్నారు. బదిర పాఠశాలలో వాటర్ లీకేజీలు వెంటనే అరికట్టాలని ఆదేశించారు. పనికిరాని, ఉపయోగించని సామగ్రిని స్టోర్ కు పంపాలని చెప్పారు.
దేవస్థానం విద్యా శాఖాధికారి శ్రీ గోవింద రాజన్, దేవస్థానం అటవీ అధికారి శ్రీ చంద్రశేఖర్ పాల్గొన్నారు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది