SECOND EDITION OF AKHANDA BALAKANDA PARAYANAM HELD _ బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌గిరులు

Tirumala, 28 September 2021: The hill town of Tirumala reverberated to the rhythmic waves of the shlokas rendered from the second edition of Akhanda Balakanda Parayanam that was held with spiritual fervour at Nada Neerajanam platform in Tirumala on Tuesday. 

 

As part of its spiritual campaign to save humanity from pandemic Corona, TTD has been organizing Parayanams for the past one and a half years. The SVBC has provided the live telecast of the popular Parayanam from 7 am onwards for the benefit of the global devotees to beget the blessings of Sri Venkateswara.

 

On Tuesday, Parayanam of 142 Slokas from 3 to 7 Sargas from the Balakanda were recited under the supervision of the chief scholarly narrator Brahmasri Prava Ramakrishna Somayajulu who explained that Rama Nama Mantram is the best medicine to overcome all evils, ailments and difficulties by mankind. 

 

The event started with Dr K Vandana and her team singing Tyagaraja Keertana “Jagadananda Karaka” and concluded with Maharshi Vedavyasa penned Ramastakam. 

 

TTD Additional EO Sri AV Dharma Reddy, National Sanskrit Varsity VC Sri Muralidhara Sharma and other Vedic pundits of TTD, Dharmagiri Veda Vignana Peetham, SV Vedic University, National Sanskrit University, scholars etc. were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌గిరులు

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 28: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని 3 నుండి 7వ‌ సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 142 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల‌గిరులు మార్మోగాయి.

బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన దివ్య శ‌క్తి మంత్రోచ్ఛ‌ర‌ణ అని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. కొన్ని వంద‌ల‌ సంవ‌త్స‌రాలుగా మాన‌వులు రామాయ‌ణం పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాల‌తో ఉన్న‌ట్లు పురాణాల ద్వారా నిరూపిత‌మైన‌ద‌న్నారు. వాల్మీకి మ‌హ‌ర్షి శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని ఆశ్ర‌యించిన‌ట్లు, యావ‌త్ ప్ర‌పంచం రామనామం పలికితే స‌క‌ల శుభాలు సిద్ధిస్తాయ‌న్నారు. ప్ర‌పంచ శాంతి, క‌రోనా మూడ‌వ వేవ్ నుండి పిల్ల‌లు, పెద్ద‌లు అన్ని వ‌ర్గ‌లవారు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని బాల‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్ర పారాయ‌ణం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌ని వివ‌రించారు.

అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం ” జ‌గ‌దానంద‌కార‌క – జ‌య జాన‌కీ ప్రాణ‌నాయ‌క ….. “, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో, ” రామ రామ రామ …..భ‌జే విశేష సుంద‌రం స‌మ‌స్త పాప ఖండ‌నం …….” అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి‌, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌నరంగాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.