బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మహోపన్యాసం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మహోపన్యాసం

తిరుపతి, జూన్‌-6,  2009: తిరుపతి ‘శ్రీ’ నివాస వాసుల కోరికపై హిందూధర్మ ప్రచార పరిషత్తు ఈ నెల 7-6-09 నుండి 13-6-09 వరకు సుప్రసిద్ధ పురాణ పండితులు, వేద విద్వాంసులు, ధార్మిక మహోపన్యాసకులు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల సమన్వయ సద్భావ నిధులు అయిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే మనం నూతనంగా నిర్మించుకొన్న శ్రీ గోవిందరాజ స్వామి వారి తీర్థ (శ్రీ జి.టి.) పుష్కరిణీ ప్రాంగణంలో ధార్మిక ప్రవచన వారోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందని విన్నవిస్తున్నాం.
ప్రవచనాంశం : ”వినరో భాగ్యము విష్ణుకథ…..”

సమయం    : ప్రతి సాయంకాలం 6.30 గంటల నుండి..
సకల వేదసారమైన శ్రీమన్నారాయణుని స్వరూప, రూప, గుణ, విభవ అవతార మహత్యాలపై రసరమ్యడోలగా భాసించే ఈ మహోపన్యాస కార్యక్రమానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం!

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.