బ్ర‌హ్మ‌శ్రీ ఆర్‌.వెంక‌ట‌రామ స‌ల‌క్ష‌ణ ఘ‌నాపాఠి మృతికి టిటిడి సంతాపం

బ్ర‌హ్మ‌శ్రీ ఆర్‌.వెంక‌ట‌రామ స‌ల‌క్ష‌ణ ఘ‌నాపాఠి మృతికి టిటిడి సంతాపం

తిరుపతి, 2020 జూలై 10: మహా‌మ‌హోపా‌ధ్యాయ భార‌త రాష్ట్ర‌ప‌తి పుర‌స్కార గ్రహీత, వేదభాష్య ర‌త్నాక‌ర, బ్ర‌హ్మ‌శ్రీ ఆర్‌. వెంక‌టరామ స‌ల‌క్ష‌ణ ఘ‌నా‌పాఠి మృతికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పుఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు శుక్ర‌వారం సంతాపం వ్య‌క్తం చేశారు. వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తున్న‌ట్టు తెలిపారు. బ్ర‌హ్మ‌శ్రీ ఆర్‌.వెంక‌ట‌రామ స‌ల‌క్ష‌ణ ఘ‌నాపాఠి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ‌ సానుభూతి తెలియ‌జేశారు.  

హైద‌రాబాద్‌కు చెందిన బ్ర‌హ్మ‌శ్రీ ఆర్‌.వెంక‌ట‌రామ స‌ల‌క్ష‌ణ ఘ‌నా‌పాఠి గ‌త మూడు ద‌శాబ్థా‌లుగా టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేద అధ్య‌య‌న సంస్థకు ఇసి మెంబ‌రుగా సేవ‌లందించారు. ఈయ‌న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అక‌డ‌మిక్ కౌన్సిల్ మెంబ‌రుగా సేవ‌లందించారు. ఎంతో మంది విద్యార్థుల‌కు వేద విద్య, వేద భాష్యం నేర్పిన మ‌హా వేద విద్వాంసులు. వీరి సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, వారులేని లోటు వేద విజ్ఞానానికి తీర్చ‌లేనిద‌ని కొనియాడారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.