TENTH EDITION BALAKANDA PARAYANAM HELD _ భక్తిభావాన్ని పంచిన బాలకాండ అఖండ పారాయణం
TIRUMALA, 25 JULY 2022: The 10th Edition of Akhanda Balakanda Parayanam was held on Nada Neerajanam platform in Tirumala on Monday.
A total of 133 slokas from 44-49 chapters of Balakanda were recited by Vedic scholars and devotees with the Parayanam lead by Sri Prava Ramakrishna Somayajulu, Sri Maruti and Sri Ramanujacharyulu.
Later the scholars also recited Ahalyakrita Sri Rama Stotram and Dhanwantari Maha Mantram on the occasion.
Dr K Vandana and her team rendered Tyagaraja Kriti, “Endaro Mahanubhavulu” at the beginning of the program and concluded with “Sri Hanuman… Jaya Hanuman ” bhajan in a mellifluous manner.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
భక్తిభావాన్ని పంచిన బాలకాండ అఖండ పారాయణం
తిరుమల, 2022 జులై 25: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు పదో విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది.
ఇందులో 45 నుండి 49 సర్గల వరకు గల 133 శ్లోకాలను పారాయణం చేశారు. అహల్యకృత శ్రీరామ స్తోత్రం 23 శ్లోకాలు, యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్రీ కె.రామానుజాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు డా.కె.వందన బృందం కార్యక్రమం మొదట్లో శ్రీ త్యాగరాజ కీర్తన “ఎందరో మహానుభావులు….”, చివరలో “శ్రీ హనుమాన్ జయ హనుమాన్…” కీర్తనలు చక్కగా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.