TTD DHARMIC AND PARAYANAMS ELEVATING BHAKTI CULT IN SOCIETY _ భక్తిభావాన్ని పెంచుతున్న ధార్మిక, పారాయణ కార్యక్రమాలు

Tirumala,12 December 2022: The dharmic programs including parayanams conducted by TTD at the Nada Neeranjanam platform in Tirumala has amplified the  Bhakti quotient in the society.

 

The dharmic programs organised by TTD since the last two years seeking the well-being of humanity are being continued wherein lakhs of devotees became partners by watching the live telecasts on SVBC channel from their homes all over the world.

 

At present, the SVBC is telecasting live Masa Vaishistyam- Brahmanda Puranam Pravachanam by Dr PTG Rangacharyulu, Assistant Professor at National Sanskrit University between 6am and 6.45 am every day.

 

Srimad Ramanayam -Balakanda -Sakala Sampadpradam is being telecasted between 7am and 8 am by Assistant Acharyulu Sri Prava Ramakrishna Somayaji of SV Vedic University and Dr Ramanujacharya of SV Veda Vignana  Peetham of Dharmagiri.

 

Between 6 pm and 7 pm Acharya Dr Kuppa Vishwanatha Sharma of National Sanskrit University delivering a discourse on Yoga Darshanam along with Dr PVNN Maruti of Veda Vignana Peetham.

 

Sabha Pravachanam by Dr P Venkatachalapathi and Sri Raghavendra  of SV Veda Vignana  Peetham of Dharmagiri every night between 8am and 9pm 

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తిభావాన్ని పెంచుతున్న ధార్మిక, పారాయణ కార్యక్రమాలు

తిరుమల, 2022 డిసెంబర్ 12: తిరుమల నాదనీరాజనం వేదికపై టిటిడి ప్రతిరోజూ నిర్వహిస్తున్న ధార్మిక, పారాయణ కార్యక్రమాలు భక్తుల్లో మరింత భక్తిభావాన్ని పెంచుతున్నాయి. లోక సంక్షేమం కోసం, మానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు నేరుగా పాల్గొంటుండగా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లక్షలాది మంది భక్తులు టీవీల ద్వారా వారి ఇళ్ల నుంచి ఈ కార్యక్రమాలను వీక్షించి తరిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

“మాస వైశిష్ట్యం – బ్రహ్మాండ పురాణం”

ఉదయం 6 నుండి 6:45 గంటల వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పి.టి.జి.రంగరామానుజాచార్యులు బ్రహ్మాండ పురాణంపై ప్రవచనం చేస్తున్నారు.

“శ్రీమద్రామాయణం – బాలకాండ – సకల సంపత్ప్రదం”

ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు శ్రీ ప్రవా రామకృష్ణ సోమయాజి, ధర్మగిరి ఎస్.వి.వేద విజ్ఞాన పీఠం శాస్త్రపండిట్ డాక్టర్ రామానుజాచార్యులు శ్రీమద్రామాయణం – బాలకాండ – సకల సంపత్ప్రదం పారాయణం చేస్తున్నారు.

“యోగ దర్శనం”

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ కుప్పా విశ్వనాధ శర్మ, ధర్మగిరి ఎస్.వి.వేద విజ్ఞాన పీఠం శాస్త్రపండిట్ డాక్టర్ పి.వి.ఎన్.ఎన్.మారుతి యోగ దర్శనంపై ఉపన్యసిస్తున్నారు.

“సభాపర్వం”

ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల వరకు ధర్మగిరి ఎస్.వి.వేద విజ్ఞాన పీఠం శాస్త్రపండిట్ డాక్టర్ పి.వేంకటాచలపతి, తంత్రసార ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ పి. రాఘవేంద్ర సభాపర్వంపై ప్రవచనాలు చేస్తున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.