SALE OF 2021 TTD DIARIES AND CALENDARS FROM AMAZON ONLINE PLATFORM- JEO _ భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఆన్‌లైన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లు : టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
Tirupati, 5 Sep. 20: Besides India Posts and other courier services, the 2021 TTD Diaries and Calendars will be made available to the devotees even through Amazon online platform this year, said TTD Joint Executive officer, Sri P Basant Kumar.
During the negotiations held with the Business representatives of Amazon in his chamber’s in TTD Administrative Building at Tirupati on Saturday evening, the JEO emphasised on Speedy and Efficient booking and delivery mechanism as there is always a huge demand for TTD Diaries and Calendars across India as well in the world among devotees.
This year the TTD is mulling to provide diaries and calendars to its devotees through the Amazon network also.
Amazon Business representatives Sri Abhilash and Sri Sheetal Kumar had agreed to present an action plan to facilitate online booking and delivery of diaries and calendars to TTD in a few days. They said, to start with, they will cover Southern India from Bengaluru in the first phase followed by Northern India from Delhi in the second phase and overseas in the next phase.
TTD FA and CA Sri O Balaji, CAO Sri Shailendra, DyEO Sri Govindarajan, OSD of Printing Section Sri Ramaraju also participated in the meeting.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఆన్‌లైన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లు :
టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
తిరుపతి, 2020 సెప్టెంబర్ 05: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లను మరింత సౌకర్యవంతంగా, వేగంగా అందించేందుకు పోస్టల్ డిపార్టుమెంటుతో పాటు అమెజాన్ సంస్థతో కూడా అందించేందుకు టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. టిటిడి పరిపాలన భవనంలో గల తమ కార్యాలయంలో ఆయన టిటిడి అధికారులు, అమెజాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి డైరీలు, క్యాలెండర్లకు విశ్వవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. గతంలో కూడా పోస్టల్‌డిపార్టుమెంట్ మరియు వివిధ కొరియర్ ఏజెన్సీల ద్వారా డైరీలు, క్యాలెండర్లు అందించినట్లు తెలిపారు. కాగా భక్తులకు మరింత విస్తృతంగా, వేగంగా టిటిడి డైరీలు, క్యాలెండర్లు అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ అయిన అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతునట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా అమెజాన్ సంస్థ ప్రతినిధులు శ్రీ అభిలాష్, శ్రీ షీతాల్ కుమార్‌లు టిటిడి డైరీలు, క్యాలెండర్లను అమెజాన్ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు త్వరలో తెలియజేస్తామన్నారు. టిటిడి నిబంధనల మేరకు దశల వారిగా దేశ విదేశాలలోని భక్తులకు టిటిడి డైరీలు క్యాలెండర్లు అందిస్తామన్నారు.
ఇందులో భాగంగా మొదట బెంగుళూరు కేంద్రంగా దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చేరవేస్తామన్నారు. అదేవిధంగా అక్టోబర్ నుండి ఢిల్లీ కేంద్రంగా ఉత్తర భారత దేశంలో అందిస్తామన్నారు. మలిదశలో విదేశాలలోని భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
కాగా టిటిడి ముద్రించిన రూ.100/- విలువగల 12 పేజీల క్యాలెండర్లు, రూ.15/- విలువగల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు, రూ.10/- విలువగల శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు, రూ.20/- విలువగల తెలుగు పంచాంగం క్యాలెండర్లు, రూ.60/- విలువగల టేబుల్ టాప్ క్యాలెండర్లు, రూ.130/- విలువగల పెద్ద డైరీలు, రూ.100/- విలువగల చిన్నడైరీలు భక్తులకు ఆన్‌లైన్ కూడా అందుబాటులో ఉంచనున్నట్లు జెఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, సిఎవో శ్రీ శేషశైలేంద్ర, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.