భక్తులకు విజ్ఞప్తి
భక్తులకు విజ్ఞప్తి
తిరుపతి, సెప్టెంబర్- 18 , 2009: తిరుమలకు లక్షలసంఖ్యలో భక్తులు విచ్చేయు సందర్భంగా స్వైన్‌ప్లూ వ్యాధి కలిగిన వారి నుంచి ఇతరులకు ఈవ్యాధి ప్రబలే అవకాశం వుంది కనుక భక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ఉదయం తితిదే పరిపాలనాభవనంలో బెంగుళూరు నాగాభరణ ఆర్ట్ ఫౌండేషన్‌కు చెందిన డి.కె. అగర్వాల్, వి.ఆర్. జయప్రియ విక్రమన్ ఒక లక్ష స్వైన్‌ప్లూ నిరోధక మాస్క్‌లను తితిదే ఇఓకు అందజేశారు. ఈ సందర్భంగా తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు మాట్లాడుతూ స్వైన్‌ప్లూ వ్యాధి వేరొక దేశము నుంచి వచ్చి మనదేశంలో ప్రబలిందని దీనిని అరికట్టవలసిన అవసరము ఉందని అన్నారు. ఈ సందర్భంగా భక్తులకకొరకు దాదాపు ఒక లక్ష స్వైన్‌ప్లూ నిరోధక మాస్క్‌లను విరాళంగా ఇచ్చిన నాగాభరణ ఆర్ట్ ఫౌండేషన్ వారిని ఇఓ అభినందించారు. అదేవిధంగా నాగాభరణ ఆర్ట్ ఫౌండేషన్ వారి కోరిక మేరకు తిరుమలలో నిర్వహిస్తున్న నాదనీరాజన కార్యక్రమములో నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు వీరికి అవకాశము ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమములో దాతలు మంజుఅగర్వాల్, డి.కె. అగర్వాల్, జయప్రియ విక్రమన్, తితిదే జె.ఇ.ఓ. డాక్టర్ యువరాజ్, ముఖ్య భద్రతాధికారి పి.వి.ఎస్. రామకృష్ణ, ప్రధాన వైధ్యాధికారి డా.శారధ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.