SATISFACTORY VAIKUNTADWARA DARSHAN TO DEVOTEES- TTD CHAIRMAN _ భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
VAIKUNTADWARA SARVA DARSHAN COMMENCED AT 5.15AM- TTD EO
Tirumala,23 December 2023 : TTD Chairman Sri Bhumana Karunakara Reddy said on Saturday in connection with the auspicious Vaikunta Ekadasi festive day, devotees had a satisfactory Vaikuntadwara Darshan for which TTD had made elaborate arrangements.
Speaking to media in front of Srivari temple on Saturday morning the Chairman greeted devotees and said devotees had comfortable Vaikuntadwara Darshan and blessings of Sri Venkateswara without any hassle on the holy day.
TTD EO Sri AV Dharma Reddy said the Vaikuntadwara Sarva Darshan began 45 minutes ahead of schedule at 5.15 am and as per time slots the special Darshan and Sarva Darshan devotees were allowed for Srivari Darshan.
He said Anna Prasadam, coffee and tea were provided to devotees. In all 8 lakh devotees are expected to be given Darshan including the special entry Darshan, Sarva Darshan and others during these ten days of Vaikuntadwara Darshan festivities at Tirumala.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
ఉదయం 5.15 గంటల నుండే వైకుంఠ ద్వార సర్వదర్శనం ప్రారంభం
• ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 23 డిసెంబరు 2023: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట శనివారం ఉదయం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.
టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ నిర్దేశిత సమయం కంటే 45 నిమిషాలు ముందుగా శనివారం ఉదయం 5.15 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని తెలిపారు. ఆ తరువాత స్లాట్ల వారీగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నామని తెలియజేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫి, పాలు అందిస్తున్నామని చెప్పారు. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ సజావుగా జరుగుతోందన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం కలిపి రోజుకు దాదాపు 70 వేల మందికి, 10 రోజుల్లో కలిపి దాదాపు 8 లక్షల మందికి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.