DEAL THE PILGRIMS WITH PATIENCE-JEO (H & E) _ భక్తులతో సంయమనం, సహనంతో వ్యవహరించండి- ఉద్యోగులకు టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి సూచన

TIRUPATI, 30 DECEMBER 2022: Since devotees from various parts of the country come for SSD tokens to have Vaikuntha Dwara Darshan of Sri Venkateswara Swamy, the staff who are deployed to issue tokens in all the SSD counters have to deal with the pilgrims with patience, said TTD JEO for Health and Education, Smt Sada Bhargavi.

Addressing the deputation staff of SSD counters at SVETA Bhavan in Tirupati on Friday, the JEO said, TTD board has decided to provide Vaikuntha Dwara Darshanam to devotees from January 2 to 11. As such, TTD has set up nearly 100 counters at 09 centres in various parts of Tirupati.

“While issuing tokens to devotees, you all should behave and deal with patience and issue the tokens without wasting the time. In the case of any issue, the counter staff should immediately report to their incharge officer. You are also supposed to stay back in the counters till your reliever comes. All staff should be in their respective counters 15 minutes prior to their duty time as given to them. All the quota for 10 days will be issued continuously starting from 2pm of January 1 till the prescribed quota of 4.5lakh tokens are completed. Consider only Adhaar Cards to issue tokens to the devotees”, she added

The JEO also said, TTD has made elaborate arrangements for devotees at all the counters viz. barricading, providing Annaprasadam, beverages, water, mobile toilets etc. 

DyEO Sri Govindarajan, SVETA Director Smt Prasanthi, GM IT Sri Sandeep were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులతో సంయమనం, సహనంతో వ్యవహరించండి

– ఉద్యోగులకు టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి సూచన

తిరుపతి 30 డిసెంబరు 2022: సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో సంయమనం, సహనంతో వ్యవహరించాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి ఉద్యోగులకు సూచించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా తిరుపతి లోని 9 ప్రాంతాల్లో సుమారుగా 100 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లలో విధులకు నియమించిన సిబ్బందికి శుక్రవారం శ్వేత భవనంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌంటర్లల్లో విధుల్లో ఉన్న సిబ్బంది యాత్రీకులతో మాట్లాడకుండా వేగంగా టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆయా కేంద్రాల ఇంచార్జ్ గా ఉన్న సీనియర్ అధికారి దృష్టికి తేవాలన్నారు.

రిలీవర్ వచ్చే వరకు కౌంటర్ నుంచి వెళ్లరాదని ఆమె సూచించారు. ఆధార్ మాత్రమే గుర్తింపు కార్డుగా తీసుకుని టోకెన్లు జారీ చేయాలన్నారు. ఉద్యోగులకు కౌంటర్ల వద్దకే టిఫిన్, తాగునీరు, కాఫీ,టీ, స్నాక్స్ వచ్చే ఏర్పాటు చేశామన్నారు. శనివారం ఉద్యోగులకు సూచించిన సమయానికి 15 నిముషాల ముందే తమకేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని జేఈవో వివరించారు. 10 రోజుల టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు నిరంతరాయంగా జనవరి 1వ తేదీ నుండి టోకెన్లు జారీ చేస్తామన్నారు.

క్యూలైన్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, వారికి అన్న ప్రసాదాలు, టిఫిన్, కాఫీ,పాలు, తాగునీరు అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఐటి జిఎం శ్రీ సందీప్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది