SRI KAPILESWARA RIDES MAKARA VAHANA _ మకర వాహనంపై కపిలతీర్థవిభుడు
Tirupati, 7 Mar. 21: Sri Kamakshi sameta Sri Kapileswara Swamy took a celestial ride on Makara Vahana on Sunday as part of the ongoing annual Brahmotsavam held in Ekantham due to Covid guidelines in Tirupati.
Makara, a vahana of Goddess Gangadevi, is being hailed in legends as an embodiment of nature’s life.
DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మకర వాహనంపై కపిలతీర్థవిభుడు
తిరుపతి, 2021 మార్చి 07: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా మకర వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.