మాజీ సి ఎం శ్రీ రోశయ్య గారి మరణం పట్ల టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి సంతాపం

మాజీ సి ఎం శ్రీ రోశయ్య గారి మరణం పట్ల టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి సంతాపం

తిరుమల 4 డిసెంబరు 2021: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారి ఆకస్మిక మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన రాష్ట్రానికి చేసిన ఎనలేని సేవలు ప్రజలకు గుర్తుండే ఉంటాయి. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది