మానవుల యోగక్షేమాలను అన్ని కాలాల్లో ఆశించే ఒకే ఒక వాఙ్మయం వేదవాఙ్మయం
మానవుల యోగక్షేమాలను అన్ని కాలాల్లో ఆశించే ఒకే ఒక వాఙ్మయం వేదవాఙ్మయం – శ్రీ శలాక రఘునాథశర్మ
తిరుపతి, 2010 మార్చి 05: తిరుమల తిరుపతి దేవస్థానముల సౌజన్యంతో శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ నిర్వహణలో అంతర్జాతీయ వేద సమ్మేళనం నూతన భవన ప్రాంగణంలో అత్యంత వైభవంగా 2010 మార్చి 3 నుండి 5 వరకు జరుగుతున్నది.
ఈ కార్యక్రమంలో ఆఖరు రోజైన సప్తమ సత్రం మొదటి సమావేశం ఉదయం విభాగానికి అధ్యకక్షులుగా శ్రీ శలాక రఘునాథశర్మ రాజమండ్రి వారు అగస్త్యవేదిక నందు వ్యవహరించారు. తితి దేవస్థానం వారు శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులతో వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ స్థాపించటం అందరూ అభినందించ తగిన విషయంగా పేర్కొన్నారు. ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి వేదాలు మార్గాన్ని నిర్థేశిస్తాయన్నారు. సర్వమానవుల యోగక్షేమాలను అన్ని కాలాల్లో ఆశించే ఒకే ఒక వాఙ్మయం వేదవాఙ్మయంగా పేర్కొన్నారు. మొదటగా శ్రీ గోలి సుబ్రహ్మణ్యశర్మ తిరుపతి వారు ”వేదములు – ఆమయనివారణోపాయములు” అనే అంశాన్ని గురించి పత్రాన్ని సమర్పించారు.
విశ్వశ్రేయస్సు వేదముల పరమలక్ష్యంగా భావించారు. ఆమయ మనగా శరీరమునంతటిని హింసించునది అమరకోశములో కూడా ఇదే విధంగా ప్రస్తావించబడినది. ఆసూరిచికిత్స సమస్తమైన శస్త్ర చికిత్సా విధానము మానుషీ చికిత్స కంఠాదుల ఔషధాన్ని సేవించుట దైవీ చికిత్స యోగం, వ్యాయామా విధానం ద్వారా చేయుట ఆది, వ్యాధి అని రెండు రకాలుగా ఉన్నాయి. అది మానసిక సంబంధి, వ్యాధి శరీర సంబంధి అని వివరించారు.
ఈ రోగాలు పాపాలవల్ల ఉద్భవిస్తాయి. ఆపాపనివారణ ద్వారా రోగాన్ని మంత్రల ద్వారా వేదాలందు ఇవ్వబడి వుంది. తద్వారా రోగ నిర్మూలన జరుగుతుంది. పూర్వజన్మకృతంపాపం వ్యాధిరూపేణ పీడిత వేదప్రోక్తమైన ఈమంత్రాలను రోగనివారణకు ఎంతో ఉపకరిస్తాయన్నారు. సాయన భాష్యం బ్రహ్మయజ్ఞ వైశిష్ట్యం విజ్ఞానం గురించి ఉపన్యసించారు. బ్రహ్మయజ్ఞము సాక్షాత్తు సర్వకామ ప్రదము అని మహర్షులు దీనిని ఎంతో నిష్ఠతో అనుష్ఠించారు. బ్రహ్మయజ్ఞ స్వరూపాన్ని సంగ్రహంగా వివరించారు. డెందుకూరి హనుమత్ ఘనపాఠి సోమయాబి గారు బ్రహ్మయజ్ఞ వైశిష్ఠ్యాన్ని గురించి సమర్థవంతంగా వివరించారు. అటు తర్వాత వంశీకృష్ణ ఘనపాఠి గారు ”వేదములు-వాయుతత్త్వం” గురించి ఉపన్యసించారు. వాయువు వల్ల అగ్నిపుడుతుంది. కార్యకారణ సంబంధాన్ని వివరించారు. తేజస్సు కూడ అగ్ని సంబంధించిన దళంగా పేర్కొన్నారు. ఎక్కడైతే సర్వవ్యాపకంగా వాయువు ఉంది దీని ఏవిధంగా స్వీకరించాలి సంబంధిత నిడివి గురించిన ఆయుర్వేద సిద్దాంత గ్రంధాల వల్ల తెలుస్తున్నది. వాయు విజ్ఞానం వల్ల ఎవరికి అపమృత్యువురాదని వేదాలు తెలియచేస్తున్నాయి. భూమి నుండి వాయువు ఉత్పన్నమౌతుంది. దిక్కుల నుండి అగ్ని నుండి వాయువు ప్రపంచమంతా ఏర్పడి ఉంది. ప్రాణః నాపరిష్వయ పవమానః అని మంత్రాన్ని అర్థ పూర్వకంగా వివరించారు.
దత్తాత్రేయస్వామి పేర్కొన్న 24 గురువులలో వాయువు కూడా ఒకటిగా అభివర్ణించారు. వాయువు స్వతాహాగా పవిత్రతను కలిగినవాడని పేర్కొన్నారు. ఋగ్వేదంలో బ్రహ్మవదీనులు అనే అంశాన్ని గురించి శ్రీ కె.వి.రాఘవాచార్యులు పత్రం సమర్పించారు.
చివరగా శ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి విజయవాడ త్రిసుపర్ణ మంత్రం వైశిష్ట్యం కృష్ణయజుర్వేదంలో త్రిసుపర్ణమంత్రాన్ని అనుష్ఠించటం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉందన్నారు. ఇందులో మూడు మంత్రాలుంటాయి. బ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధకాలైన పాపాలు నశించి దోషం నివారింపబడుతుంది. ఈ మంత్రం జపించడం పరిశుద్దత ఏర్పడుతుందని అన్నారు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులే కాక సర్వదేవతా సమిష్ఠి స్వరూపమే త్రిసుపర్ణమని పేర్కొన్నారు. అనంతరం పండిత సత్కారం తదుపరి వందన సమర్పణతో ఈ కార్యక్రమం పరిసమాప్తమయింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.