WOMAN IS SOURCE FOR HUMAN CIVILIZATION – TTD BOARD CHIEFమానవ నాగరికతకు మూలం మహిళ- టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి
TIRUPATI, 07 MARCH 2024: The base of Human Civilization is a woman, advocated TTD Chairman Sri Bhumana Karunakara Reddy amidst a grand round of applause from women folks who participated in the International Women’s Day held at Mahati Auditorium in Tirupati on Thursday.
Gracing the event as the Chief Guest TTD Trust Board Chairman quoted the examples of Gargi, Ghosha, Lopamudra of Vedic age to the women PMs who ruled the countries across the world and the present day women who are doing wonders in every field on par with men giving them tough competition he aspired the women employees of TTD as well the students of various TTD educational institutions to follow their path and achieve goals.
Earlier TTD EO Sri AV Dharma Reddy wished every woman and girl the International women’s Day and said in Hindu Dharma the role of women is more important than God… “Talli, Tandri, Guruvu, Daivam”… So women are the custodians of the human race, he maintained.
Renowned Spiritual Speaker Dr Ananta Lakshmi, first woman Padmasri awardee in Mridangam Smt Sumati Ram Mohan Rao, Famous Vocalist Dr Dwaram Lakshmi, upcoming and eminent athlete Kum. Nandini Agasara also spoke on the occasion.
Before the commencement of the program, a ten-minute AV on Women achievers of Tirupati has been displayed which threw focus on Pallava Queen Samavai Perundevi, Sri Ramanujacharya mother Bhoopiratti, Tarigonda Vengamba, Damsel Lingasani, Komalamma, Bharat Ratna Smt MS Subbulakshmi and others who made their valuable contributions related to Tirumala and Tirupati which impressed the audience.
Later the invitees were felicitated and Padma Awards were given away to 20 women employees for their services in their respective offices. The Chairman also felicitated a Multipurpose worker Smt Subhashini, Offset Printer Smt Bhagyavati, Dolu College Nadaswaram HoD Smt Raviprabha, woman tonsurer Smt Gita were also felicitated on the occasion.
In the evening session, cultural programs were conducted where women employees of all age groups showcased their talents. Later the women who are going to retire this year have also been felicitated.
Later prizes have also been distributed to winners in Painting, Singing and Quiz competitions.
JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, DLO Sri Veerraju, DEO Sri Bhaskar Reddy, DyEO welfare Smt Snehalata, DyEO Board Cell Smt Prasanthi, other women HoDs, Principals, Women leaders were also present.
Assistant PRO Kum Neelima and Dr Krishnaveni, Head of the Telugu Department in SPWDPG College anchored the event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మానవ నాగరికతకు మూలం మహిళ
– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి
– మహతిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
– 20 మందికి పద్మావతి అవార్డులు ప్రదానం
మార్చి 07, తిరుపతి, 2024: దాదాపు మూడు లక్షల సంవత్సరాల క్రితం టాంజానియా దేశంలో లూసీ అనే మహిళ ప్రసవించిన పిల్లల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి వ్యాప్తి చెందిందని పరిశోధనల ద్వారా తెలుస్తోందని, ఈ రకంగా మానవ నాగరికతకు మహిళ బీజాలు వేసిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గురువారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ పురాణాల ప్రకారం ఆదిదేవత మహిళ అన్నారు. చాలా గ్రామాల్లో గ్రామదేవతలు మహిళలని తెలియజేశారు. చరిత్రలో చాలామంది రాణులు చక్కటి రాజ్యపాలన చేశారని, ఆధునిక కాలంలో శ్రీమతి సిరిమావో బండారు నాయకే, శ్రీమతి ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ లాంటి మహిళామణులు దేశ ప్రధానులుగా తమదైన ముద్ర వేశారని చెప్పారు. వేద కాలంలో గార్గి, మైత్రేయి లాంటివారు జ్ఞానానికి మారుపేరుగా నిలిచారని వివరించారు. భారతీయ సమాజం మొదట్లో మాతృస్వామిక వ్యవస్థగా ఉండేదని, క్రమంగా పితృస్వామిక వ్యవస్థగా మారిందని చెప్పారు. వర్తమాన సమాజంలో మహిళలు ఆయా రంగాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. పురుషాధిక్య సమాజంలో ఉన్న మహిళలు జ్ఞానానికి మరింత పదును పెట్టాలని, ఇందుకోసం పాఠ్యపుస్తకాలతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని అందించే ఇతర పుస్తకాలను అధ్యయనం చేయాలని కోరారు.
మొదటి దైవం తల్లి : టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ మనకు మొదటి దైవం తల్లి అన్నారు. హైందవ సనాతన సంస్కృతిలో మహిళకు విశేషమైన స్థానం ఉందని చెప్పారు. టీటీడీ ఉద్యోగినులు తమ ఇంటిని చక్కబెట్టుకున్న విధంగానే, సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయడానికి కృషి చేయాలని కోరారు. టీటీడీ కళాశాలల అధ్యాపకులు మరింత శ్రద్ధతో పనిచేసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. కళాశాల విద్యార్థులు చక్కగా చదువుకొని టీటీడీకి మంచి పేరు తీసుకురావాలని, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కోరారు.
అంతరిక్షయానం నుంచి యుద్ధరంగం వరకు అన్నింటా మహిళలే : శ్రీమతి అనంతలక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీమతి అనంతలక్ష్మి మాట్లాడుతూ భారతీయ సమాజంలో స్త్రీ శక్తికి ఉన్నత స్థానం ఉందన్నారు. మహిళలు రాజ్యపాలనతో పాటు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని తెలియజేశారు. పురుషులు బుద్ధితో ఆలోచిస్తే, మహిళలు హృదయంతో ఆలోచించి పాలన సాగిస్తారని చెప్పారు. మహిళ విజయం వెనుక కుటుంబం ప్రోత్సాహం తప్పక ఉంటుందన్నారు. అంతరిక్షయానంతోపాటు యోగా, తపోసాధనకు మహిళ శరీరం అనువుగా ఉంటుందని పరిశోధనల్లో నిరూపితమైందన్నారు. అంతరిక్ష యానం నుంచి యుద్ధరంగం వరకు అన్నింటా మహిళ కీలక పాత్ర పోషిస్తోందని తెలియజేశారు.
పద్మశ్రీ అవార్డు పొందిన తొలి మహిళా మృదంగం కళాకారిణి శ్రీమతి దండమూడి సుమతి రాంమోహన్ రావు మాట్లాడుతూ ప్రతి మహిళ విజయం వెనక ఒక పురుషుడు ఉంటాడనే నానుడిని నిజం చేస్తూ, తన ఎదుగుదలకు తన భర్త పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. వారి ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు.
ప్రముఖ గాత్ర కళాకారిణి డా. ద్వారం లక్ష్మీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు మహిళలు పాటుపడాలని కోరారు. ఆసక్తిగల విద్యార్థినులు సంగీతం, నాట్యం లాంటి భారతీయ కళలను నేర్చుకోవాలని సూచించారు.
అనంతరం అతిథులుగా విచ్చేసిన పద్మశ్రీ అవార్డు పొందిన తొలి మహిళా మృదంగం కళాకారిణి శ్రీమతి దండమూడి సుమతి రాంమోహన్ రావు, ప్రముఖ గాత్ర కళాకారిణి డా. ద్వారం లక్ష్మీ, ఆసియన్ గేమ్స్ పతక విజేత, అథ్లెట్ కుమారి నందిని అగసార, తిరుపతికి చెందిన ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీమతి శోభారాణి, టీటీడీ మహిళా క్షురకురాలు శ్రీమతి గీత, తిరుమల ఆరోగ్యశాఖలో మల్టీపర్పస్ వర్కర్ శ్రీమతి సుభాషిణి, ముద్రణాలయంలో సీనియర్ ఆఫ్ సెట్ ప్రింటర్ శ్రీమతి భాగ్యవతి, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, డోలు పాఠశాల నాదస్వర విభాగాధిపతి శ్రీమతి రవిప్రభను శాలువతో సన్మానించి శ్రీ పద్మావతి అమ్మవారి జ్ఞాపిక, శ్రీవారి ప్రసాదం అందించారు.
పద్మావతి అవార్డులు
టీటీడీలోని వివిధ విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న 20 మంది మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. వీరిని శాలువతో సన్మానించి 5 గ్రాముల వెండి డాలర్, శ్రీ పద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందించారు. వీరిలో టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. సుజాతమ్మ, సూపరింటెండెంట్లు శ్రీమతి మల్లీశ్వరి, శ్రీమతి ఇందిర, చీఫ్ పీఆర్వో కార్యాలయ అసిస్టెంట్ శ్రీమతి సుగుణ తదితరులు ఉన్నారు.
అదేవిధంగా, ఏడాది కాలంలో ఉద్యోగ విరమణ చేయనున్న 57 మంది మహిళా ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో సన్మానించారు.
కార్యక్రమంలో ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి శ్రీవాణి బృందం ప్రదర్శించిన వీణా వాద్యకచేరి ఎంతగానో ఆకట్టుకుంది.
అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్, గాత్ర సంగీత పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఆ తర్వాత టీటీడీ మహిళా ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా నిర్వహించారు.
టీటీడీ ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. కృష్ణవేణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డిఎల్వో శ్రీ వీర్రాజు, డీఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, పలువురు మహిళా డెప్యూటీ ఈఓలు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.