TTD COMMITTED TOWARDS TAKING FORWARD SANATANA HINDU DHARMA – KANCHI PONTIFF _ కంచి స్వామి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాల్గొన్న టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

Tirupati, 07 March 2024: Kanchi Kamakoti Pontiff Sri Sri Sri Vijayendra Saraswati Swami lauded the TTD Chairman Sri Bhumana Karunakara Reddy’s efforts in propagating and protecting the Sanatana Hindu Dharma, its cultural heritage and traditions by carrying out unique programs.

Earlier Chairman participated in the birthday celebrations of the Kanchi Pontiff at the Kanchi Mutt on the ISKCON Road in Tirupati and presented the silk vastram to the pontiff.

During his Anugraha speech, the Kanchi pontiff lauded the TTD Chairman for giving land for a setting up a conventional school and also lauded his role in beautifying and developing the Gangamma temple and the recently held successful Dharmic conference, besides naming a road in Tirupati after Kanchi seer HH Sri Chandrasekhara Swami.

Speaking on the occasion the TTD Chairman said the new Vedic school for Imparting traditional education to women started by the Kanchi Mutt is a role model to the entire country.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హైంద‌వ సనాతన సంస్కృతి పరిరక్షణకు టీటీడీ ఛైర్మ‌న్ తోడ్పాటు

•⁠ ⁠కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ విజయేంద్రసరస్వతి స్వామి ఉద్ఘాట‌న‌

•⁠ ⁠కంచి స్వామి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాల్గొన్న టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

తిరుప‌తి, 2024, మార్చి 07: హైంద‌వ సనాతన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తోడ్పాటు అందిస్తున్నార‌ని, వేద ధర్మాన్ని అనుసరిస్తూ, మెండుగా
సత్కార్యాలు నిర్వహించే మహద్భాగ్యం వారికి దక్కిందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ విజయేంద్రసరస్వతి స్వామి ఉద్ఘాటించారు. తిరుప‌తి ఇస్కాన్ రోడ్డులోని కంచి మఠంలో గురువారం జరిగిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ విజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మదిన వేడుకల్లో టీటీడీ ఛైర్మన్ శ్రీ‌ భూమన కరుణాకర రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి వస్త్రాలు స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా కంచి స్వామి అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. శ్రీ‌వారి ఆశీర్వాదంతో వ‌చ్చిన అవ‌కాశాన్ని శ్రీ కరుణాకర రెడ్డి ధ‌ర్మ‌ప్ర‌చారానికి వినియోగిస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. సంప్రదాయ విద్యాబోధన చేసేందుకు ఉద్దేశించిన పాఠశాల నిర్మాణానికి టీటీడీ ద్వారా స్థలం ఇచ్చారని తెలిపారు. పూర్వ‌కాలంలో ఆలయంలో దానాధికారి ఉండేవార‌ని, ఆ పాత్రను శ్రీ‌ భూమన కరుణాకర రెడ్డి పోషిస్తున్నార‌ని కొనియాడారు. ఇటీవల‌ తిరుమలలో జ‌రిగిన ధార్మిక సదస్సులో తాము కూడా సందేశం ఇచ్చామ‌న్నారు. తిరుపతిలో శ్రీ గంగమ్మ ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించార‌ని తెలిపారు. శ్రీ చంద్రశేఖరస్వామివారి పేరిట తిరుపతిలో కొత్త మార్గానికి నామకరణం చేసి, త‌న చేతుల‌మీదుగా ప్రారంభోత్సవం చేయించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

అనంత‌రం టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా వారిని దర్శించుకోవడం త‌న‌ పూర్వజన్మ సుకృతమ‌న్నారు. సాక్షాత్తు శంకరాచార్యుల ప్రతిరూపంగా శంకర స్వరూపాన్ని అత్యంత గొప్పగా సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని, ప్రజలందరినీ సనాతన ధర్మం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. సనాతన సంస్కృతి పూర్వ‌వైభవం కోసం స్వామివారు చేస్తున్న సంకల్పయాగం అద్భుత విజయాలను అందిస్తోంద‌న్నారు. మహిళల కోసం సనాతన సంస్కృతి, సంప్రదాయ విద్యను ప్రబోధించే పాఠశాలను స్వామివారు నెలకొల్పడం భారత జాతికే గర్వకారణమ‌న్నారు. స్వామివారి ఆశీస్సుల‌తోనే ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయన సంస్థలో ఉన్న వేద‌పండితుల‌కు వేతనాలు పెంచే అదృష్టం త‌న‌కు ద‌క్కింద‌న్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.