మార్చి 1 నుండి మార్చి 31 వరకు ”శుభప్రదం” దరఖాస్తులు

మార్చి 1 నుండి మార్చి 31 వరకు ”శుభప్రదం” దరఖాస్తులు

తిరుమల, 2013 మార్చి 01: నేటి యువతరంలో మానవీయ విలువలు, హైందవ సనాతన ధార్మిక విలువలను పెంచడంలో భాగంగా తితిదే గత ఏడాది నుండి వేసవి సెలవుల్లో ప్రారంభించిన శుభప్రదం శిక్షణ తరగతులు ఈ ఏడాది మే 12 నుండి 18వ తారీఖు వరకు తితిదే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనదలచిన వారికి మార్చి 1 నుండి మార్చి 31వ తారీఖు వరకు తితిదే కల్యాణమండపాలన్నింటిలోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

కాగా, పదో తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. అంతేగాకుండా బాలుర కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. బాలికల కొరకు ఐదు కేంద్రాలకే పరిమితం చేసినట్టు చెప్పారు. ఈ శిక్షణ తరగతులను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈవో పిలుపునిచ్చారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.