TEPPOTSAVAMS FROM MARCH 13 TO 17 _ మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

TIRUMALA, 11 MARCH 2022: The annual Teppotsavams will commence in Tirumala on March 13 and conclude on March 17.

 

This five-day float festival is observed everyday evening from 7pm onwards in Swami Pushkarini. On the first day evening, Sri Sita Lakshmana Anjaneya Sameta Sri Rama Chandra Murthy will take a celestial ride on the finely decked float while on the second day Sri Krishna Swamy along with Rukmini, and on the last three days Sri Malayappa accompanied by Sridevi and Bhudevi will take a celestial ride on the float.

 

TTD has cancelled all the virtual arjita sevas on the occasion. On March 13 and 14 Sahasra Deepalankara Seva remains cancelled while on the last three days, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Sevas stand cancelled. Devotees are requested to make note of this change.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, 2022 మార్చి 11: తిరుమలలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.

తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా వ‌ర్చువ‌ల్ అర్జిత‌సేవ‌లైన సహస్రదీపాలంకార సేవను మార్చి 13, 14వ తేదీల్లో మార్చి 15, 16, 17వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.