DEVOTEES WILL BE ALLOWED FOR DARSHAN WITH TIME SLOTS FROM MARCH 17 ON WARDS – TTD EO _ మార్చి 17వ తేదీ నుండి టైమ్ స్లాట్లు టోకెన్ల ద్వారా నేరుగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 14 Mar. 20: The pilgrims will be allowed for darshan by issuing Time slot tokens with out making them wait in Compartments from March 17 onwards as a preventive measure to check the spread of Corona Virus, said, TTD EO Sri Anil Kumar Singhal.

Addressing media persons at Annamaiah Bhavan in Tirumala on Saturday evening, the EO along with Additional EO Sri AV Dharma Reddy said that following call given by the State Government to initiate measures to check the prevalence of Corona Virus as Tirumala happens to be the most populated pilgrim centre with the highest congregation of pilgrims, we have contemplated some measures”, he added.

VAIKUNTHAM COMPARTMENTS REMAINS CLOSED

The devotees will not be made to sit in the compartments of Vaikuntham Queue Complex to avoid person to person contact. “In the given time slots, the pilgrims will be allowed for darshan by limiting the numbers. The devotees should bring any ID card viz. Adhaar, Voter, Driving Licence etc. along with them to get the Time Slot tokens for darshan”, he said. 

Compartments will be set up in Tirumala and Tirupati to issue Time-slot tokens to devotees. The devotees have to co-operate with TTD, as they will have darshan only in the Time slots given to them. They will not be allowed for darshan if they fail to come on time. 

VONTIMITTA KALYANAM CANCELLED ON APRIL 7

In view of the State alert on Corona threat, the celestial wedding ceremony of Sri Sita Rama Kalyanam which will be usually observed at Vontimitta as a part of the annual brahmotsavams of Sri Kodanda Ramaswamy temple is cancelled this year.

Many states have already declared a ban on the public congregation in many places especially religious centres, gyms, pubs, theatres etc.to avoid the spread of Corona. 

As nearly one lakhs devotees are expected to converge for the celestial Kalyanam on April 7 at Vontimitta and sit for nearly 6-7 hours, TTD has decided to cancel the mass fete keeping in view the health safety of devotees. However, the Kalyanam will be observed in the temple as usual on the same day”, he mentioned.

BHOOMI POOJA POSTPONED

The Bhoomi Pooja for the construction of Sri Venkateswara Swamy temple at Mumbai, which is scheduled on April 5, is also postponed following Corona Virus threat. 

CERTAIN ARJITHA SEVAS REMAIN CANCELLED

Certain Arjitha Sevas including Visesha Puja, Sahasra Kalasabhishekam and Vasanthotsavam will remain cancelled to avoid congregation of pilgrims for long duration. If any devotee is cancelling these arjitha seva tickets, they will be allotted with VIP break darshan by the Additional EO upon their request.

CLEANING MEASURES

Thermal Screening is arranged at Alipiri, Srivari mettu, VQC, KKC, Annaprasadam also where the congregation of pilgrims is more. The cottages and rest houses will be allotted to pilgrims only after thoroughly cleaning them with disinfectants. The Health Officer is also directed to deploy more number of sanitation workers at all the vital points. Each area will be allotted to a senior officer to monitor who will observe the sanitation and cleaning process round the clock and report the same to Additional EO at Tirumala”, he said.

DHANVANTARI YAGAM FROM MARCH 19-21

Seeking the divine intervention to safeguard the humanity from the dreadful virus, TTD will be observing a three-day Maha Yagam, Sri Srinivasa Shantyotsava Sahita Dhanvantari Maha Yagam from March 19 to 21 under the guidance of the Chief Pontiff of Visakha Sarada Peetham, Sri Swarupanandendra Saraswathi Swamy and Mantralaya Raghavendra Mutt Seer Sri Subudendratheertha Swamy at Paruveta Mandapam in Tirumala.

DEVOTEES SHOULD CO-OPERATE

The EO appealed to devotees via media, to co-operate with the amendments brought by TTD in view of the red alert sounded by Central and State governments over the spread of Corona Virus, keeping the health safety of pilgrims in to consideration. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 17వ తేదీ నుండి టైమ్ స్లాట్లు టోకెన్ల ద్వారా నేరుగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2020 మార్చి 14: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మార్చి 17వ తేదీ మంగ‌ళ‌వారం నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్న‌ట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం సాయంత్రం  ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్ధీని దృష్ఠిలో ఉంచుకుని రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి తీసుకున్న నిర్ణ‌యాల‌ను వివ‌రించారు.

టైంస్లాట్ టోకెన్లు జారీ –

–       మార్చి 17వ తేదీ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మ‌రియు 2ల‌లో  వేచి ఉండ‌కుండా టైంస్లాట్ టోకెన్లు పొందిన భ‌క్తుల‌ను నేరుగా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు.

–       భ‌క్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియ‌జేశారు.  

–       భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమల మరియు తిరుపతిల‌లో టైమ్ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు
అందుబాటులోనికి  తెస్తామ‌న్నారు.

–       టైంస్లాట్ టోకెన్లు తీసుకునే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ , ఒట‌ర్ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు  వంటి ఏదేని గుర్తింపు కార్డున్ని తీసుకురావాల‌న్నారు.

–        భ‌క్తులు త‌మ‌కు కేటాయించిన స‌మాయానికి ద‌ర్శ‌నానికి వ‌చ్చి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు –

–       అదేవిధంగా భ‌క్తులు వేచి ఉండే స‌మ‌యాన్ని త‌గ్గించేందుకు విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసిన‌ట్లు తెలిపారు.

–      విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవ‌ల‌ను ముంద‌స్తుగా పొంది, ఆర్జిత సేవ‌ల‌ ర‌ద్దు కార‌ణంగా వారికి టిటిడి అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో సంప్ర‌దిస్తే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం కేటాయిస్తార‌న్నారు.  

–      ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన నిర్వ‌హించ‌వ‌ల‌సిన శ్రీ సీతా రామూల క‌ల్యాణంను ఆల‌యం వెలుప‌ల ర‌ద్ధు చేసి గ‌తంలో వ‌లే ఆల‌యం లోప‌ల నిర్వ‌హిస్తార‌న్నారు.    

–       ఏప్రిల్ 5వ తేదీన‌ ముంబాయిలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్ధు చేసిన‌ట్లు తెలిపారు.      

ధన్వంతరి మహాయాగం –

–       ప్ర‌జ‌లంద‌రు ఆరోగ్యంగా ఉండ‌డానికి స్వామివారి ఆశీస్సుల‌కై  శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నట్టు వివ‌రించారు.

–       ఈ మ‌హాయాగాన్ని మార్చి 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు తిరుమ‌ల‌లోని పార్వేటి మండ‌పం వ‌ద్ద నిర్వ‌హిస్తామ‌న్నారు.  

–      విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు, మంత్రాల‌యం శ్రీ రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ సుబుదేంద్ర‌తీర్థ స్వామివార్ల ఆధ్వ‌ర్యంలో ఈ యాగం నిర్వ‌హిస్తార‌న్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు –

–        అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతోపాటు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, అన్నప్రసాద భవనం తదితర ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంద‌న్నారు.

– భ‌క్తులు ఎక్కువ‌గా ఉండే పిఏసిలు, అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క‌ల్యాణ‌క‌ట్ట, సేవాస‌ద‌న్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి ప‌రిశుభ్ర‌త(శానిటైజ్‌) చ‌ర్య‌లు చేపడుతున్నాం.

– వ‌స‌తి గ‌దులను భ‌క్తులు ఖాళీ చేసిన త‌రువాత ఒక గంట పాటు స‌రైన విధంగా శుభ్రం చేసిన త‌రువాత మ‌రొక‌రికి కేటాయిస్తాం.

– తిరుమల లోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు. ఇది 24 గంటలపాటు పని చేస్తుంది.  యాత్రికులు 0877 – 2263447  నంబరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి  నివారణ చర్యలను తెలుసుకోవచ్చు.

– కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలపై ఇప్పటికే టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు అవగాహన కల్పించడం జరిగింది. అధికారులు ఆయా విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

– అలిపిరి వద్ద యాత్రికులకు కరోనా వ్యాధి ల‌క్ష‌ణాల‌ను ప్రాథ‌మికంగా గుర్తిస్తే తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపేందుకు చర్యలు చేపట్టాం.

ఈ స‌మావేశంలో టిటిడి ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.